2, డిసెంబర్ 2013, సోమవారం

కంసానిపల్లి (Kamsanpally)

 కంసానిపల్లి గ్రామము
గ్రామముకంసానిపల్లి 
మండలముదామరగిద్ద
జిల్లానారాయణపేట
జనాభా2697 (2001)
3213 (2011)
కంసానిపల్లి నారాయణపేట జిల్లా దామరగిద్ద మండలమునకు చెందిన గ్రామము. ఇది పంచాయతి కేంద్రము. మహబూబ్‌నగర్ జిల్లాలో ఉన్న ఈ గ్రామం ఫిబ్రవరి 17, 2019న కొత్తగా ఏర్పాటుచేసిన నారాయణపేట జిల్లాలో భాగమైంది.

జనాభా:
2001 లెక్కల ప్రకారం గ్రామ జనాభా 2697. ఇందులో పురుషులు 1407, మహిళలు 1290. గృహాల సంఖ్య 464.
2011 గణన ప్రకారం గ్రామ జనాభా 3213. ఇందులో పురుషులు 1662, మహిళలు 1551. గృహాల సంఖ్య 533. అక్షరాస్యత శాతం 35.20%. గ్రామ కోడ్ సంఖ్య 575021.

రాజకీయాలు:

2013, జూలై 23న జరిగిన గ్రామపంచాయతి ఎన్నికలలో సర్పంచిగా గురునాథ్ గౌడ్ ఎన్నికైనాడు.

విద్యాసంస్థలు:
గ్రామంలో మండల పరిషత్తు ప్రాథమికోన్నత పాఠశాల ఉన్నది.

ఎంపిటీసి నియోజకవర్గం:

మండలంలోని 14 ఎంపిటీసి నియోజకవర్గాలలో ఇది ఒకటి. 2006 ఎన్నికలలో ఈ నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి రాధమ్మ విజయం సాధించింది. మొత్తం పోలైన ఓట్లు 2301 కాగా, రాధమ్మకు 1308, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి భీముడుకు 902 ఓట్లు వచ్చాయి.



విభాగాలు: దామరగిద్ద మండలంలోని గ్రామాలు


 = = = = =

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి