కందన్‌పల్లి నారాయణపేట జిల్లా దామరగిద్ద మండలమునకు చెందిన గ్రామము. ఇది పంచాయతి కేంద్రము. మహబూబ్‌నగర్ జిల్లాలో ఉన్న ఈ గ్రామం ఫిబ్రవరి 17, 2019న కొత్తగా ఏర్పాటుచేసిన నారాయణపేట జిల్లాలో భాగమైంది.
జనాభా: 2001 లెక్కల ప్రకారం గ్రామ జనాభా 1163. ఇందులో పురుషులు 592, మహిళలు 571. గృహాల సంఖ్య 197. 2011 గణన ప్రకారం గ్రామ జనాభా 1241. ఇందులో పురుషులు 606, మహిళలు 635. గృహాల సంఖ్య 253. అక్షరాస్యత శాతం 34.65%. గ్రామ కోడ్ సంఖ్య 575011. రాజకీయాలు: 2013, జూలై 23న జరిగిన గ్రామపంచాయతి ఎన్నికలలో సర్పంచిగా యశ్వవర్థన్ ఎన్నికైనాడు. విద్యాసంస్థలు: గ్రామంలో మండల పరిషత్తు ప్రాథమిక పాఠశాల ఉన్నది. ఎంపిటీసి నియోజకవర్గం: మండలంలోని 14 ఎంపిటీసి నియోజకవర్గాలలో ఇది ఒకటి. 2006 ఎన్నికలలో ఈ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థి భీంరెడ్డి వెంకటరెడ్డి విజయం సాధించాడు. మొత్తం పోలైన ఓట్లు 1156 కాగా బి.వెంకటరెడ్డికి 605 ఓట్లు వచ్చాయి. తెలుగుదేశం పార్టీ అభ్యర్థి లక్ష్మయ్యగౌడ్‌కు 495 ఓట్లు లభించాయి.
= = = = =
| |||||||||||
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి