ఇన్ముల్‌నర్వ మహబూబ్‌నగర్ జిల్లా కొత్తూరు మండలమునకు చెందిన గ్రామము. ఇది పంచాయతి కేంద్రము.
జనాభా: 2001 లెక్కల ప్రకారం గ్రామ జనాభా 4259. ఇందులో పురుషులు 2195, మహిళలు 2064. గృహాల సంఖ్య 803. 2011 లెక్కల ప్రకారం గ్రామ జనాభా 5151. ఇందులో పురుషులు 2649, మహిళలు 2502. గృహాల సంఖ్య 1144. అక్షరాస్యత శాతం 48.86%. గ్రామ కోడ్ సంఖ్య 575222. రాజకీయాలు: 2013 జూలైలో జరిగిన గ్రామపంచాయతి ఎన్నికలలో గ్రామసర్పంచిగా పి.కమలమ్మ ఎన్నికయ్యారు. జహంగీర్ పీర్ దర్గా: రాష్ట్ర రాజదానికి 36 కి.మీ. దూరంలో కల కొత్తూరు మండలంలోని ఇన్ముల్‌నర్వ గ్రామ సమీపంలో జహంగీర్ పీర్ దర్గా కలదు. ప్రతి సంవత్సరము సంక్రాంతి పర్వదినాలలో 3 రోజుల పాటు దర్గాలో ఉర్సు ఉత్సవాలు జరుగుతాయి. సుమారు 700 సం.ల క్రితం బాగ్దాద్ నుండి గౌస్ మొహినొద్దీన్, బురానొద్దిన్ అనే ఇరువురు మత గురువులు దేశ సంచారము చేస్తూ ఇక్కడికి వచ్చి కొంత కాలం తరువాత మరణించినారని చెబుతారు. వారి ఇద్దరి సమాధులే జహంగీర్ పీర్ దర్గాగా వాడుకలో కొచ్చిందని నమ్ముతారు. 400 సం.ల క్రితం గోలుకొండ కోటపై విజయం సాధించిన రాజులు తరువాత ఈ దర్గాకు వచ్చి పూజలు చేసారని ప్రతీతి. దర్గాకు నిర్వాహకులు లేనందున తమ సిపాయిలలో ఒకరైన సయ్యద్ ఇబ్రాహిం అలీని దర్గా సంరక్షకుడుగా నియమించి, 4 పరగణాలకు ఖాజీగా కూడా నియుక్తులను చేసారు. 1948 సం. వరకు ఇబ్రాహిం అలీ వారసులు సంరక్షించే వారు. ఆ తరువాత రాష్ట్ర వక్ఫ్ బోర్డ్ ఆదీనంలోకి ఈ దర్గా వచ్చింది. మరొక వర్గం అభిప్రాయం ప్రకారం దర్గా స్థానంలో పూర్వ కాలంలో నరసింహ స్వామి దేవాలయం ఉండేదని అందుకే విశ్వాసంతో హిందువులు కూడా అధిక సంఖ్యలో ఈ దర్గాకు వస్తారని ఇక్కడి వారి నమ్మకం. ఇక్కడికి వెళ్ళడానికి హైద్రాబాద్ నుండి ప్రతి ఆదివారము మరియు గురువారము రోజున ప్రత్యేక బస్సులు నడుస్తుంటాయి. ఆటో, జీపులు కూడా నడుస్తుంటాయి.
= = = = =
సంప్రదించిన గ్రంథాలు, వెబ్‌సైట్లు:
| |||||||||||
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి