కడ్తాల్ మహబూబ్‌నగర్ జిల్లా ఆమనగల్ మండలమునకు చెందిన గ్రామము. ఇది పంచాయతి కేంద్రము. గ్రామంలో లక్ష్మీ చెన్నకేశ్వస్వామి ఆలయం ఉంది. ఏటా బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తారు. యువ దర్శకుడు ప్రవీణ్ రెడ్డి కడ్తాల్ గ్రామానికి చెందినవారు. ఇతను గాయం-2 సినిమాకు దర్శకత్వం వహించారు. గ్రామంలో ఆంధ్రాబ్యాంకు శాఖ ఉంది. గ్రామ సమీపంలో దేశంలోనే అతి పెద్ద పిరమిడ్ ధ్యానకేంద్రం ఉంది.
జనాభా: 2001 లెక్కల ప్రకారం గ్రామ జనాభా 9201. ఇందులో పురుషులు 4954, మహిళలు 4247. గృహాల సంఖ్య 1773. 2011 గణన ప్రకారం గ్రామ జనాభా 11663. ఇందులో పురుషులు 6304, మహిళలు 5359. గృహాల సంఖ్య 2446. అక్షరాస్యత శాతం 49.07%. గ్రామ కోడ్ సంఖ్య 575279. రాజకీయాలు: 2013, జూలై 23న జరిగిన గ్రామపంచాయతి ఎన్నికలలో గ్రామ సర్పంచిగా వేణుగోపాల్ ఎన్నికయ్యారు. గ్రామంలో 2 ఎంపీటీసి స్థానాలుండగా 2014 ఎన్నికలలో రెండింటిలోనూ కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. సంఘటనలు:
= = = = =
| |||||||||||
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి