కానుకుర్తి నారాయణపేట జిల్లా దామరగిద్ద మండలమునకు చెందిన గ్రామము. ఇది పంచాయతి కేంద్రము. ఈ గ్రామము కర్ణాటక సరిహద్దులో కలదు. ఇక్కడికి దగ్గరిలోనే కర్ణాటక లోని యానగుంది మాణిక్యేశ్వరిమాత పుణ్యక్షేత్రం ఉంది. మహబూబ్‌నగర్ జిల్లాలో ఉన్న ఈ గ్రామం ఫిబ్రవరి 17, 2019న కొత్తగా ఏర్పాటుచేసిన నారాయణపేట జిల్లాలో భాగమైంది.
జనాభా: 2001 లెక్కల ప్రకారం గ్రామ జనాభా 3461. ఇందులో పురుషులు 1696, మహిళలు 1765. గృహాల సంఖ్య 717. 2011 గణన ప్రకారం గ్రామ జనాభా 4280. ఇందులో పురుషులు 2091, మహిళలు 2189. గృహాల సంఖ్య 785. అక్షరాస్యత శాతం 46.61%. గ్రామ కోడ్ సంఖ్య 575003. రవాణా సౌకర్యాలు: ఈ గ్రామం జిల్లా కేంద్రం మండల కేంద్రం దామరగిద్ద నుంచి కర్ణాటకలో జాతీయ రహదారిపై ఉన్న మాణికేశ్వరి ఆలయం వెళ్ళు మార్గంలో ఉంది. రాజకీయాలు: 2013, జూలై 23న జరిగిన గ్రామపంచాయతి ఎన్నికలలో సర్పంచిగా రాజమణి ఎన్నికైనది. విద్యాసంస్థలు: గ్రామంలో జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాల, 2 మండల పరిషత్తు ప్రాథమిక పాఠశాలలు ఉన్నాయి. ఎంపిటీసి నియోజకవర్గం: మండలంలోని 14 ఎంపిటీసి నియోజకవర్గాలలో ఇది ఒకటి. 2006 ఎన్నికలలో ఈ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఎన్.చిన్నకిష్టప్ప తన సమీప ప్రత్యర్థి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి టి.కాశీనాథ్ విజయం సాధించాడు. మొత్తం పోలైన ఓట్ల సంఖ్య 1727 కాగా చిన్నకిష్టప్పకు 850 ఓట్లు, కాశీనాథ్‌కు 806 ఓట్లు వచ్చాయి.
= = = = =
| |||||||||||
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి