16, డిసెంబర్ 2013, సోమవారం

కేతిరెడ్డిపల్లి (Kethireddipally)

 కేతిరెడ్డిపల్లి గ్రామము
గ్రామముకేతిరెడ్డిపల్లి 
మండలముబాలానగర్ 
జిల్లామహబూబ్‌నగర్
జనాభా1652 (2001)
1906 (2011)
కేతిరెడ్డిపల్లి మహబూబ్‌నగర్ జిల్లా బాలానగర్ మండలమునకు చెందిన గ్రామము. ఇది పంచాయతి కేంద్రము. 2011 గణన ప్రకారం గ్రామ జనాభా 1906. ఇది పంచాయతి కేంద్రము. ఈ గ్రామము 44వ నెంబరు జాతీయ రహదారికి ఆనుకొని ఉంది. గ్రామ ప్రజల ముఖ్యవృత్తి వ్యవసాయము. పత్తి, మొక్కజొన్న, వరి, కూరగాయలు పండిస్తారు. ఆగస్టు 2010లో తెలంగాణపై నియమించిన శ్రీకృష్ణ కమిటి ఈ గ్రామాన్ని సందర్శించింది.

జనాభా:
2001 లెక్కల ప్రకారం గ్రామ జనాభా 1652. ఇందులో పురుషులు 856, మహిళలు 793. గృహాల సంఖ్య 336.
2011 గణన ప్రకారం గ్రామ జనాభా 1906. ఇందులో పురుషులు 997, మహిళలు 909. గృహాల సంఖ్య 445. అక్షరాస్యత శాతం 48.53%. గ్రామ కోడ్ సంఖ్య 575113.


గ్రామపాలన:
ఈ గ్రామం పంచాయతి కేంద్రము. గ్రామపాలన గ్రామపంచాయతీచే నిర్వహించబడుతుంది. గ్రామ పారిశుద్ధ్యం, వీధిదీపములు, సిసి రోడ్లు, మురికి కాల్వల నిర్మాణం తదితర పనులు గ్రామపంచాయతి చేపడుతుంది. ప్రస్తుత గ్రామ సర్పంచి సుధాకర్ రావు. ఇదివరకు కె.సుదర్శన్ రావు (1982-95), జె.లక్ష్మణ్ నాయక్ (1995-2001), వి.శేఖరయ్య (2001-06), డి.కృష్ణయ్య (2006-11)లు సర్పంచిగా పనిచేశారు. ప్రస్తుత సర్పంచి సుధాకర్ రావు.
ప్రస్తుత సర్పంచ్
కె.సుదర్శన్ రావు
2001-06 కాలంలో
గ్రామ సర్పంచి వి.శేఖరయ్య


రాజకీయాలు:
2013, జూలై 27న జరిగిన గ్రామపంచాయతి ఎన్నికలలో గ్రామ సర్పంచిగా సుధాకర్ రావు ఎన్నికయ్యారు.






(గ్రామ సమాచారం అందించిన మాజీ సర్పంచి వి.శేఖరయ్య మరియు ప్రస్తుత సర్పంచి సుదర్శన్‌రావు  గారికి కృతజ్ఞతలు)

విభాగాలు: బాలానగర్ మండలంలోని గ్రామాలు


 = = = = =

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి