2, డిసెంబర్ 2013, సోమవారం

క్యాతన్‌పల్లి (Kyatanpalli)

 క్యాతన్‌పల్లి గ్రామము
గ్రామముక్యాతన్‌పల్లి 
మండలముదామరగిద్ద
జిల్లానారాయణపేట
జనాభా1888 (2001)
2339 (2011)
క్యాతన్‌పల్లి నారాయణపేట జిల్లా దామరగిద్ద మండలమునకు చెందిన గ్రామము. ఇది పంచాయతి కేంద్రము. క్యాతన్ పల్లిలో వీరబ్రహ్మేశ్వరస్వామి ఆలయం ఉంది. మహబూబ్‌నగర్ జిల్లాలో ఉన్న ఈ గ్రామం ఫిబ్రవరి 17, 2019న కొత్తగా ఏర్పాటుచేసిన నారాయణపేట జిల్లాలో భాగమైంది.

జనాభా:
2001 లెక్కల ప్రకారం గ్రామ జనాభా 1888. ఇందులో పురుషులు 927, మహిళలు 961. గృహాల సంఖ్య 352.
2011 గణన ప్రకారం గ్రామ జనాభా 2339. ఇందులో పురుషులు 1155, మహిళలు 1184. గృహాల సంఖ్య 433. అక్షరాస్యత శాతం 43.48%. గ్రామ కోడ్ సంఖ్య 575019.

రాజకీయాలు:
2013, జూలై 23న జరిగిన గ్రామపంచాయతి ఎన్నికలలో సర్పంచిగా జలలమ్మ ఎన్నికైనది.

విద్యాసంస్థలు:
గ్రామంలో జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాల, మండల పరిషత్తు ప్రాథమిక పాఠశాల ఉన్నాయి.



విభాగాలు: దామరగిద్ద మండలంలోని గ్రామాలు


 = = = = =

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి