2, డిసెంబర్ 2013, సోమవారం

మల్‌రెడ్డిపల్లి (Malreddypally)

 మల్‌రెడ్డిపల్లి గ్రామము
గ్రామముమల్‌రెడ్డిపల్లి 
మండలముదామరగిద్ద
జిల్లానారాయణపేట
జనాభా1669 (2001)
2262 (2011)
మల్‌రెడ్డిపల్లి నారాయణపేట జిల్లా దామరగిద్ద మండలమునకు చెందిన గ్రామము. ఇది పంచాయతి కేంద్రము. గ్రామ పరిధిలో 214 ఎకరాల ఆయకట్టు ఉన్న దేశాయి చెరువు ఉంది. మిషన్ కాకతీయలో భాగంగా చెరువు పునరుద్దరణకు ప్రభుత్వ అనుమతి లభించింది. మహబూబ్‌నగర్ జిల్లాలో ఉన్న ఈ గ్రామం ఫిబ్రవరి 17, 2019న కొత్తగా ఏర్పాటుచేసిన నారాయణపేట జిల్లాలో భాగమైంది.

జనాభా:
2001 లెక్కల ప్రకారం గ్రామ జనాభా 1669. ఇందులో పురుషులు 839, మహిళలు 860. గృహాల సంఖ్య 309.
2011 గణన ప్రకారం గ్రామ జనాభా 2262. ఇందులో పురుషులు 1112, మహిళలు 1150. గృహాల సంఖ్య 415. అక్షరాస్యత శాతం 37.40%. గ్రామ కోడ్ సంఖ్య 575004.

రాజకీయాలు:

2013, జూలై 23న జరిగిన గ్రామపంచాయతి ఎన్నికలలో సర్పంచిగా పద్మమ్మ ఎన్నికైనది.

విద్యాసంస్థలు:
గ్రామంలో మండల పరిషత్తు ప్రాథమికోన్నత పాఠశాల ఉన్నది.

ఎంపిటీసి నియోజకవర్గం:

మండలంలోని 14 ఎంపిటీసి నియోజకవర్గాలలో ఇది ఒకటి. 2006 ఎన్నికలలో ఈ నియోజకవర్గం నుంచి సిపీఐ(ఎం) అభ్యర్థి రామకృష్ణయ్య విజయం సాధించాడు. మొత్తం 1466 ఓట్లు పోల్ కాగా రామకృష్ణయ్యకు 776 ఓట్లు వచ్చాయి. కాంగ్రెస్ అభ్యర్థి చంద్రప్ప 551 ఓట్లతో రెండోస్థానం పొందాడు. భాజపా అభ్యర్థి శ్యామతప్పకు 55 ఓట్లు వచ్చాయి.


విభాగాలు: దామరగిద్ద మండలంలోని గ్రామాలు


 = = = = =

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి