2, డిసెంబర్ 2013, సోమవారం

నాగిరెడ్డిపల్లి (Nagireddipally)

 నాగిరెడ్డిపల్లి గ్రామము
గ్రామముబాపల్లితండా 
మండలముబొంరాస్‌పేట్ 
జిల్లామహబూబ్‌నగర్
జనాభా494 (2001)
624 (2011)
నాగిరెడ్డిపల్లి మహబూబ్‌నగర్ జిల్లా బొంరాస్‌పేట్ మండలమునకు చెందిన గ్రామము. ఇది పంచాయతి కేంద్రము. మండల మొదటి ఎంపీపీగా ఈ గ్రామానికి చెందిన ప్రమీలాదేవి 1986-91 వరకు పనిచేశారు. 2006లో ఆమె నాగిరెడ్డిపల్లి సర్పంచిగా ఎన్నికైనది. అంతకుక్రితం ఆమె కుమారుడు వెంకటేశ్వర్ రెడ్డి సర్పంచిగా పనిచేశారు. ఈ గ్రామం 2013 నిర్మల్ అవార్డుకు ఎంపికై కోడంగల్ నియోజకవర్గంలోనే ఈ అవార్డు అందుకున్న తొలి గ్రామంగా అవతరించింది.

జనాభా:
2001 లెక్కల ప్రకారం గ్రామ జనాభా 494. ఇందులో పురుషులు 264, మహిళలు 230. గృహాలసంఖ్య 102.
2011 ప్రకారం గ్రామ జనాభా 624. ఇందులో పురుషులు 315, మహిళలు 309, గృహాల సంఖ్య 110. అక్షరాస్యత శాతం 43.91%. గ్రామ కోడ్ సంఖ్య 574930.

రాజకీయాలు:
2013 జూలై 23న జరిగిన గ్రామపంచాయతి ఎన్నికలలో గ్రామ సర్పంచిగా కేశవులు ఎన్నికయ్యారు.

గ్రామపంచాయతి:
2006-11 కాలంలో సర్పంచిగా పనిచేసిన ప్రమీలాదేవి గ్రామపంచాయతిలో శుభ్రతకు ప్రాధాన్యత ఇచ్చారు.  పంచాయతి 2 సార్లు "శుభ్రం" అవార్డుకు ఎంపికైనది. 2013లో నిర్మల్ పురస్కారం పొందింది. ప్రస్తుతం కేశవులు సర్పంచిగా ఉన్నారు.


విభాగాలు: బొంరాస్‌పేట్ మండలంలోని గ్రామాలు


 = = = = =

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి