17, డిసెంబర్ 2013, మంగళవారం

మైసిగండి (Mysigandi)

 మైసిగండి గ్రామము
గ్రామముమైసిగండి 
మండలముఆమనగల్
జిల్లామహబూబ్‌నగర్
సందర్శనీయ స్థలాలుమైసమ్మ ఆలయం
మైసిగండి మహబూబ్‌నగర్ జిల్లా ఆమనగల్ మండలమునకు చెందిన గ్రామము. ఇది పంచాయతి కేంద్రము. ఈ గ్రామంలో ప్రముఖమైన మైసమ్మ ఆలయం ఉంది.

రాజకీయాలు:
2013, జూలై 23న జరిగిన గ్రామపంచాయతి ఎన్నికలలో గ్రామ సర్పంచిగా శేఖర్ గౌడ్ ఎన్నికయ్యారు.
2014 ఎంపీటీసి ఎన్నికలలో ఇక్కడి నుంచి కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎ.శ్రీనివాస్ గౌడ్ విజయం సాధించారు.

మైసమ్మ ఆలయం:
హైదరాబాదు- శ్రీశైలం ప్రధాన రహదారిపై ఉన్న మైసమ్మ ఆలయం దినదినాభివృద్ధి చెందుతోంది.  ఒకప్పుడు ఒక చెట్టు నీడ క్రింద వెలసిన మైసమ్మ దేవతకు ప్రస్తుతం కోట్ల వ్యయంతో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు. అంచెలంచెలుగా ఎదుగుతూ ఆలయం ప్రస్తుతం దేవాదాయశాఖ అధీనంలోకి చేరింది. శ్రీశైలం వెళ్ళే రహదారిపై ఉండుటచే అక్కడికి వెళ్ళే భక్తులు కూడా అధిక సంఖ్యలో ఈ ఆలయాన్ని సందర్శిస్తారు.



విభాగాలు: ఆమనగల్ మండలంలోని గ్రామాలు


 = = = = =

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి