3, డిసెంబర్ 2013, మంగళవారం

పర్సాపూర్ (Parsapur)

 పర్సాపూర్ గ్రామము
గ్రామముపర్సాపూర్ 
మండలముకోడంగల్ 
జిల్లామహబూబ్‌నగర్
జనాభా2249 (2001)
2761 (2011)
పర్సాపూర్ మహబూబ్‌నగర్ జిల్లా కోడంగల్ మండలమునకు చెందిన గ్రామము. ఇది పంచాయతి కేంద్రము.

భౌగోళికం, సరిహద్దులు:
ఈ గ్రామం భౌగోళికంగా మండలంలో తూర్పువైపున ఉన్నది. ఈ గ్రామానికి ఉత్తరాన కోడంగల్, దక్షిణాన హస్నాబాద్, పశ్చిమాన పెద్దనందిగామ, ప్యాలమద్ది, తూర్పున బొంరాస్‌పేట్ మండలం సరిహద్దుగా ఉన్నది.

జనాభా:
2001 లెక్కల ప్రకారం గ్రామ జనాభా 2249. ఇందులో పురుషులు 1107, మహిళలు 1142. గృహాల సంఖ్య 397.
2011 గణన ప్రకారం గ్రామ జనాభా 2761. ఇందులో పురుషులు 1365, మహిళలు 1396. గృహాల సంఖ్య 588. అక్షరాస్యత శాతం 41.94%. గ్రామ కోడ్ సంఖ్య 574916.

రవాణా సౌకర్యాలు:

మహబూబ్‌నగర్ నుంచి తాండూరు వెళ్ళు ప్రధానరహదారి గ్రామం గుండా వెళ్ళుచున్నది. కాబట్టి గ్రామస్థులకు బస్సులు, ప్రైవేటు వాహనాలు అందుబాటులో ఉన్నాయి.

రాజకీయాలు:

జూలై 23, 2013న జరిగిన గ్రామపంచాయతి ఎన్నికలలో గ్రామ సర్పంచిగా ముత్యాలమ్మ ఎన్నికయ్యారు.


విభాగాలు: కోడంగల్ మండలంలోని గ్రామాలు


 = = = = =

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి