5, డిసెంబర్ 2013, గురువారం

రావులపల్లి (Ravulapally)

రావులపల్లి గ్రామము
గ్రామమురావులపల్లి 
మండలముకోడంగల్ 
జిల్లామహబూబ్‌నగర్
జనాభా2588 (2001)
3011 (2011)
రావులపల్లి మహబూబ్‌నగర్ జిల్లా కోడంగల్ మండలమునకు చెందిన గ్రామము. ఇది పంచాయతి కేంద్రము. ఈ గ్రామం కోడంగల్ నుంచి కర్ణాటకలోని గుల్బర్గా వెళ్ళు రహదారిపై ఉంది. కోడంగల్ నుంచి 5 సార్లు శాసనసభ్యుడిగా ఎన్నికైన ఆర్. గురునాథ్ రెడ్డి ఈ గ్రామానికి చెందినవారు.

భౌగోళికం, సరిహద్దులు:
భౌగోళికంగా ఈ గ్రామం మండలంలో దక్షిణ భాగంలో ఉంది. ఈ గ్రామానికి ఉత్తరాన అంగడిరాయచూర్, పశ్చిమాన ఇందనూర్ గ్రామాలు ఉండగా, దక్షిణానమరియు తూర్పున దౌల్తాబాదు మండలం సరిహద్దుగా ఉన్నది.

జనాభా:
2001 లెక్కల ప్రకారం గ్రామ జనాభా 2588. ఇందులో పురుషులు 1317, మహిళలు 1271. గృహాల సంఖ్య 464.
2011 గణన ప్రకారం గ్రామ జనాభా 3011. ఇందులో పురుషులు 1493, మహిళలు 1518. గృహాల సంఖ్య 615. అక్షరాస్యత శాతం 47.09%. గ్రామ కోడ్ సంఖ్య 574912.

రవాణా సౌకర్యాలు:
హైదరాబాదు నుంచి బీజాపూర్ వెళ్ళు అంతర్రాష్ట్ర రహదారి గ్రామం మీదుగా వెళ్ళుచున్నది. కాబట్టి ప్రధాన పట్టణాలకు వెళ్ళడానికి గ్రామస్థులకు రవాణా సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయి. కర్ణాటకలోని సేడం వెళ్ళు రహదారి కూడా ఇక్కడి నుంచి ప్రారంభమౌతుంది.

రాజకీయాలు:
జూలై 23, 2013న జరిగిన గ్రామపంచాయతి ఎన్నికలలో గ్రామ సర్పంచిగా సాయమ్మ ఎన్నికయ్యారు.


విభాగాలు: కోడంగల్ మండలంలోని గ్రామాలు


 = = = = =

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి