3, డిసెంబర్ 2013, మంగళవారం

రుద్రారం (Rudraram)

 రుద్రారం గ్రామము
గ్రామమురుద్రారం 
మండలముకోడంగల్ 
జిల్లామహబూబ్‌నగర్
జనాభా3110 (2001)
3026 (2011)
రుద్రారం మహబూబ్‌నగర్ జిల్లా కోడంగల్ మండలమునకు చెందిన గ్రామము. ఇది పంచాయతి కేంద్రము. ఇది మండలంలో 2వ పెద్ద గ్రామము. కాకతీయ రుద్రమదేవి పేరుమీదుగా ఈ గ్రామానికి రుద్రవరం పేరు వచ్చినట్లుగా క్రమేణా అది రుద్రారంగా మారినట్లు చారిత్రక కథనం. ఇక్కడ రుద్రమదేవిచే నెలకొల్పబడిన ఆలయం ఉంది.

భౌగోళికం, సరిహద్దులు:
భౌగోళికంగా ఈ గ్రామం మండలంలో వాయువ్యాన కర్ణాటక రాష్ట్ర సరిహద్దులో ఉన్నది. ఈ గ్రామానికి తూర్పున నాగారం, టేకులకోడ్, ఉప్పరిపల్లి గ్రామాలుండగా, పశ్చిమాన కర్ణాటక మరియు రంగారెడ్డి జిల్లా, ఉత్తరాన రంగారెడ్డి జిల్లా సరిహద్దుగా ఉన్నది.

జనాభా:
2001 లెక్కల ప్రకారం గ్రామ జనాభా 6082. ఇందులో పురుషులు 3110, మహిళలు 2972. గృహాల సంఖ్య 1140.
2011 గణన ప్రకారం గ్రామ జనాభా 6401. ఇందులో పురుషులు 3026, మహిళలు 3015. గృహాల సంఖ్య 1209. అక్షరాస్యత శాతం 44.94%. గ్రామ కోడ్ సంఖ్య 574899.

రవాణా సౌకర్యాలు:
కోడంగల్ నుంచి గ్రామానికి బస్సు సదుపాయం ఉంది, ప్రైవేటు వాహనాలు కూడా గ్రామస్థులకు అందుబాటులో ఉన్నాయి.

రాజకీయాలు:
జూలై 23, 2013న జరిగిన గ్రామపంచాయతి ఎన్నికలలో గ్రామ సర్పంచిగా దామోదర్ రెడ్డి ఎన్నికయ్యారు.



విభాగాలు: కోడంగల్ మండలంలోని గ్రామాలు


 = = = = =

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి