16, డిసెంబర్ 2013, సోమవారం

ఉడిత్యాల (Udityal)

ఉడిత్యాల గ్రామము
గ్రామముఉడిత్యాల 
మండలముబాలానగర్ 
జిల్లామహబూబ్‌నగర్
జనాభా5036 (2001)
5443 (2011)
ఉడిత్యాల మహబూబ్‌నగర్ జిల్లా బాలానగర్ మండలమునకు చెందిన గ్రామము. ఇది పంచాయతి కేంద్రము. 2011 గణన ప్రకారం గ్రామ జనాభా 5443. గ్రామంలో 2 ఎంపీటీసి స్థానాలు కలవు.

జనాభా:
2001 లెక్కల ప్రకారం గ్రామ జనాభా 5036. ఇందులో పురుషులు 2551, మహిళలు 2485. గృహాల సంఖ్య 931.
2011 గణన ప్రకారం గ్రామ జనాభా 5443. ఇందులో పురుషులు 2788, మహిళలు 2655. గృహాల సంఖ్య 1215. అక్షరాస్యత శాతం 41.01%. గ్రామ కోడ్ సంఖ్య 575100.

రాజకీయాలు:
  • 2013, జూలై 27న జరిగిన గ్రామపంచాయతి ఎన్నికలలో గ్రామ సర్పంచిగా టి.నిర్మల ఎన్నికయ్యారు. 
  • 2014లో జరిగిన ఎంపీటీసి ఎన్నికలలో ఉడిత్యాల్-1 స్థానం నుంచి తెరాసకు చెందిన చంద్రయ్య తన సమీప ప్రత్యర్థి, కాంగ్రెస్ పార్టీక్ చెందిన మోతీలాల్‌పై 178 ఓట్ల ఆధిక్యతతో విజయం సాధించారు. ఉడిత్యాల్-2 స్థానం నుంచి తెరాసకు చెందిన ఇందు తన సమీప ప్రత్యర్థి, కాంగ్రెస్ పార్టీకి చెందిన నర్సమ్మపై 298 ఓట్ల ఆధిక్యతతో గెలుపొందారు. 
విద్యాసంస్థలు:
గ్రామంలో జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాల ఉంది. ఈ పాఠశాలకు 2012-13 సంవత్సరానికి పర్యావరణ మిత్ర అవార్డు లభించింది.


విభాగాలు: బాలానగర్ మండలంలోని గ్రామాలు


 = = = = =

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి