22, జులై 2018, ఆదివారం

మట్టంపల్లి మండలం (Mattampally Mandal)

మట్టంపల్లి మండలం
జిల్లా సూర్యాపేట
రెవెన్యూ డివిజన్ సూర్యాపేట
అసెంబ్లీ నియోజకవర్గంహుజూర్ నగర్
లోకసభ నియోజకవర్గంనల్గొండ
మట్టంపల్లి సూర్యాపేట జిల్లాకు చెందిన మండలము. మండలంలో 10 రెవెన్యూ గ్రామాలు, 16 గ్రామపంచాయతీలు కలవు. మండల కేంద్రంలో లక్ష్మీనరసింహస్వామి క్షేత్రం, చర్చి, సాగర్ సిమెంట్ కర్మాగారం ఉన్నాయి.  అక్టోబరు 11, 2016కు ముందు ఈ మండలం నల్గొండ జిల్లాలో భాగంగా ఉండేది. తొలిదశ తెలంగాణ ఉద్యమకారుడు తెలంగాణ రామిరెడ్డి ఈ మండలానికి చెందినవారు. 1968లో ఈయన ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు

భౌగోళికం, సరిహద్దులు:
ఈ మండలం భౌగోళికంగా జిల్లాలో దక్షిణాన ఆంధ్రప్రదేశ్ సరిహద్దులో ఉంది. దక్షిణ సరిహద్దు గుండా కృష్ణానది ప్రవహిస్తోంది. ఉత్తరాన హుజూర్‌నగర్ మండలం, తూర్పున మేళ్ళచెరువు మండలం మరియు చింతలపాలెం మండలం, పశ్చిమాన పాలకీడు మండలం, వాయువ్యాన గరిడేపల్లి మండలం సరిహద్దులుగా ఉన్నాయి.

జనాభా:
2001 లెక్కల ప్రకారం మండల జనాభా 41857, 2011 నాటికి జనాభా 3104 పెరిగి 44961 కు చేరింది. 2011 లెక్కల ప్రకారం మండల జనాభా 44961. ఇందులో పురుషులు 22628, మహిళలు 22333.

రాజకీయాలు:
ఈ మండలము హుజూర్ నగర్ అసెంబ్లీ నియోజకవర్గం, నల్గొండ లోకసభ నియోజకవర్గంలో భాగంగా ఉన్నది. జడ్పీ చైర్మెన్‌గా, 3 సార్లు ఎంపీగా పనిచేసిన జి.ఎస్.రెడ్డి ఈ మండలమునకు చెందినవారు. గుండ్లపల్లికి చెందిన తెలంగాణ రామిరెడ్డి (గుండా రామిరెడ్డి) 1968లో ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు

మండలంలోని రెవెన్యూ గ్రామాలు:
Alipuram, Chennaipalem, Choutapalli, Gundlapalli, Mattampalli, Mattapalli, Pedaveedu, Raghunathapalem, Vardapuram, Yatavakilla

ప్రముఖ గ్రామాలు
మట్టంపల్లి (Mattampally):
మట్టంపల్లి సూర్యాపేట జిల్లాకు చెందిన గ్రామము మరియు మండల కేంద్రము. జడ్పీ చైర్మెన్‌గా, 3 సార్లు ఎంపీగా పనిచేసిన జి.ఎస్.రెడ్డి ఈ గ్రామమునకు చెందినవారు. మండల కేంద్రంలో లక్ష్మీనరసింహస్వామి క్షేత్రం, చర్చి ఉన్నాయి. గ్రామంలో సాగర్ సిమెంట్ కర్మాగారం ఉంది. కృష్ణానది తీరంలో ఉన్న ఈ గ్రామం పంచనారసింహ క్షేత్రాలలో ఇది ఒకటి. గ్రామంలోని చర్చి తెలంగాణలోని ప్రముఖ చర్చిలలో ఒకటిగా పేరుపొందింది.
గుండ్లపల్లి (Gundlapalli):
గుండ్లపల్లి సూర్యాపేట జిల్లా మట్టంపల్లి మండలమునకు చెందిన గ్రామము. తొలిదశ తెలంగాణ ఉద్యమకారుడు తెలంగాణ రామిరెడ్డి ఈ గ్రామానికి చెందినవారు. 1968లో ఈయన ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు

ఇవి కూడా చూడండి:

ఫోటో గ్యాలరీ
మఠంపల్లి చర్చి
2016కు ముందు నల్గొండ జిల్లాలో
మట్టంపల్లి మండలమ్
c c


విభాగాలు: సూర్యాపేట  జిల్లా మండలాలు,  మట్టంపల్లి మండలము, సూర్యాపేట రెవెన్యూ డివిజన్, హుజూర్ నగర్అసెంబ్లీ నియోజకవర్గం, 
= = = = =
సంప్రదించిన పుస్తకాలు, వెబ్‌సైట్లు:
  • Handbook of Statistics, Nalgonda Dist, 2012,
  • Handbook of Census Statistics, Nalgonda District, 2001,
  • Census of India 2011, Provistional Population Totals, Part 2, Volume 2 of 2011.
  • బ్లాగు రచయిత సందర్శించి తెలుసుకున్న, సేకరించిన సమాచారం,
  • తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ GO Ms No 246 తేది: 11-10-2016 
  • నల్గొండ జిల్లా స్వాతంత్ర్యసమరయోధుల చరిత్ర


Mattampalli Mandal Suryapet Dist (district) Mandal in telugu, Suryapet Dist Mandals in telugu,

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి