27, జులై 2018, శుక్రవారం

మేళ్ళచెరువు మండలం (Mellacheruvu Mandal)

మేళ్ళచెరువు మండలం
జిల్లా సూర్యాపేట
రెవెన్యూ డివిజన్ కోదాడ
అసెంబ్లీ నియోజకవర్గంహుజూర్ నగర్
లోకసభ నియోజకవర్గంనల్గొండ
మేళ్ళచెరువు సూర్యాపేట జిల్లాకు చెందిన మండలము. స్వాతంత్ర్యోద్యమ నేత, 2 సార్లు ఎమ్మెల్యేగా, రాష్ట్ర మంత్రిగా పనిచేసిన అక్కిరాజు వాసుదేవరావు ఈ మండలమునకు చెందినవారు. అక్టోబరు 11, 2016కు ముందు ఈ మండలం నల్గోండ జిల్లాలో ఉండేది. అక్టోబరు 11, 2016న మండలంలోని 10 గ్రామాలను విడదీసి కొత్తగా చింతలపాలెం మండలాన్ని ఏర్పాటుచేశారు. ప్రస్తుతం మండలంలో 4 గ్రామాలు ఉన్నాయి.

భౌగోళికం, సరిహద్దులు:
ఈ మండలానికి ఉత్తరాన కోదాడ మండలం, ఆగ్నేయాన మరియు దక్షిణాన చింతలపాలెం మండలం, నైరుతిన మరియు పశ్చిమాన మట్టంపల్లి మండలం, వాయువ్యాన హుజూర్‌నగర్ మండలం, తూర్పున ఖమ్మం జిల్లా సరిహద్దులుగా ఉన్నాయి.

రాజకీయాలు:
ఈ మండలము హుజూర్ నగర్ అసెంబ్లీ నియోజకవర్గం, నల్గొండ లోకసభ నియోజకవర్గంలో భాగంగా ఉన్నది. 2 సార్లు ఎమ్మెల్యేగా, రాష్ట్ర మంత్రిగా పనిచేసిన అక్కిరాజు వాసుదేవరావు ఈ మండలానికి చెందినవారు.

మండలంలోని రెవెన్యూ గ్రామాలు:
Kandibanda, Mellacheruvu, Revoor, Yepalamadhavaram

ప్రముఖ గ్రామాలు
మేళ్ళచెరువు (Mellacheruvu):
మేళ్ళచెరువు సూర్యాపేట జిల్లాకు చెందిన గ్రామము మరియు మండల కేంద్రము. ఇది చరిత్రాత్మకమైన గ్రామము. గ్రామంలో శంభులింగేశ్వరాలయం ఉంది. స్వాతంత్ర్యోద్యమ నేత మరియు 2 సార్లు ఎమ్మెల్యేగా, రాష్ట్ర మంత్రిగా పనిచేసిన అక్కిరాజు వాసుదేవరావు ఈ గ్రామానికి చెందినవారు.

ఇవి కూడా చూడండి:

ఫోటో గ్యాలరీ
b
a
c c


విభాగాలు: సూర్యాపేట  జిల్లా మండలాలు,  మేళ్ళచెరువు మండలము, కోదాడ రెవెన్యూ డివిజన్, హుజూర్ నగర్అసెంబ్లీ నియోజకవర్గం, 
= = = = =
సంప్రదించిన పుస్తకాలు, వెబ్‌సైట్లు:
  • Handbook of Statistics, Nalgonda Dist, 2012,
  • Handbook of Census Statistics, Nalgonda District, 2001,
  • Census of India 2011, Provistional Population Totals, Part 2, Volume 2 of 2011.
  • బ్లాగు రచయిత సందర్శించి తెలుసుకున్న, సేకరించిన సమాచారం,
  • తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ GO Ms No 246 తేది: 11-10-2016 
  • నల్గొండ జిల్లా స్వాతంత్ర్యసమరయోధుల చరిత్ర


Akkineni Vasudev Rao, Mellacheruvu Mandal Suryapet Dist (district) Mandal in telugu, Suryapet Dist Mandals in telugu,

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి