సివేరి సోమ విశాఖపట్టణం జిల్లా అరకులోయ మండలం మాదాల పంచాయతి బట్టివలస గ్రామానికి చెందినవారు. తెలుగుదేశం పార్టీలో కార్యకర్తగా ప్రవేశించి 1988లో మాదాల నుంచి సర్పంచిగా, 2001లో జడ్పీటీసీగా ఎన్నికైనారు. 2009లో అరకు నుంచి శాసనసభకు ఎన్నికైనారు. 2014లో వైకాపా అభ్యర్థు కిడారి సర్వేశ్వరరావు చేతిలో ఓడిపోయారు. సెప్టెంబరు 23, 2018న తెలుగుదేశం పార్టీలో చేరిన కిడారి సర్వేశ్వరరావుతో కలిసి విశాఖపట్టణం లోని మన్యం అడవుల గుండా వెళ్తుండగా లివిరిపుట్టు వద్ద మావోయిస్టుల చేతిలో హతులైనారు.
ఇవి కూడా చూడండి:
= = = = =
| |||||||||||
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి