2, మార్చి 2019, శనివారం

అబినందన్ వర్థమాన్ (Abhinandan Varthaman)

అబినందన్ వర్థమాన్
జననంజూన్ 21, 1983
హొదాఎయిర్ ఫోర్స్ వింగ్ కమాండర్
భారత వైమానిక దళం వింగ్ కమాండర్ హోదాలో ఉన్న అబినందన్ వర్థమాన్ జూన్ 21, 1983న తమిళనాడులో జన్మించారు. అభినందన్ తండ్రి కూడా ఎయిర్ మార్షల్‌గా పనిచేశారు.

ఫిబ్రవరి 27, 2019న ఇండో-పాకిస్తాన్ పోరాట సమయంలో మిగ్-21 యుద్ధవిమానం బైసన్ పైలెట్‌గా వ్యవహరించి చాకచక్యంతో పాకిస్తాన్‌కు చెందిన ఎఫ్-16 యుద్ధవిమానాన్ని నేలకుల్చాడు. పాకిస్తాన్ యుద్ధవిమానాలు వదిలిన వార్‌హెడ్లు తగిలి అభినందన్ ఉన్న యుద్ధవిమానం కూలేదశలొ ప్యారాచుట్‌తో నేలపైకి దిగాడు. అయితే అది ఆక్రమిత పాకిస్తాన్ కావడంతో అక్కడి ప్రజలు అబినందన్‌ను తీవ్రంగా కొట్టుచుండగా పాక్ సైనికులు అక్కడి నుంచి తరలించి తమ అధీనంలో ఉంచుకున్నారు. ఆ తర్వాత భారత్ చేసిన దౌత్యనీతితో పాకిస్తాన్ దిగివచ్చి మార్చి 1, 2019 రాత్రి వాఘా సరిహద్దు వద్ద భారత్‌కు అప్పగించింది.

ఇవి కూడా చూడండి:


విభాగాలు: 2019లో వార్తల్లోని వ్యక్తులు,


 = = = = =


About Abhinandan vardhaman in Telugu

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి