తెలుగు పండితునిగా, రచయితగా, పోటీపరీక్షల శిక్షకుడిగా పేరుపొందిన ద్వాదశి నాగేశ్వరశాస్త్రి జూన్ 15, 1948న కృష్ణా జిల్లా లింగాల గ్రామంలో జన్మించారు. ద్వాదశి నాగేశ్వరశాస్త్రి సంక్షిప్తంగా ద్వానా శాస్త్రిగా ప్రసిద్ధి చెందారు. ఈయన తల్లిదండ్రులు లక్ష్మీప్రసన్న, తండ్రి కృష్ణశాస్త్రి. ద్వానాశాస్త్రి ఫిబ్రవరి 26, 2019న హైదరాబాదులో మరణించారు
జీవన ప్రస్థానం: ఏలూరు సి.ఆర్. రెడ్డి కాలేజిలో బి.ఎస్.సి, ఆంధ్ర విశ్వవిద్యాలయంలో ఎం.ఏ (తెలుగు) పుర్తిచేసి నాగార్జున విశ్వవిద్యాలయం నుంచి ఎం.ఫిల్, తెలుగు విశ్వవిద్యాలయంలో పి.హెచ్.డి., ఉస్మానియా విశ్వవిద్యాలయంలో పోస్టు గ్రాడ్యుయేట్ డిప్లొమా పట్టాలు పొందారు. మారేపల్లి రామచంద్ర శాస్త్రి కవిత్వం మీద ఎం. ఫిల్. సిద్ధాంత వ్యాసాన్ని సమర్పించారు. 1972 నుండి 2004 వరకు అమలాపురం కళాశాలలో తెలుగు శాఖలో రీడరుగా పనిచేసిన ఈయన ఉద్యోగాల పోటీ పరీక్షలకు హాజరయ్యే విద్యార్ధులకి శిక్షణ ఇచ్చారు. రచనలు: ముఖ్యమైన రచనలు: ఆంధ్ర సాహిత్యం, మన తెలుగు తెలుసుకుందాం, ద్వానా కవితలు, తెలుగు సాహిత్య చరిత్ర, మన తెలుగు వైభవం, మాటలంటే మాటలా? ఇదీ మన తెలుగు. తెలంగాణ సాహితీవేత్తల వివరాలతో ద్వానా శాస్త్రి తెలంగాణ సాహిత్య రత్నాల వీణ పేరుతో ద్వానాశాస్త్రి ప్రత్యేక సంచిక తీసుకువచ్చా రు ఇవి కూడా చూడండి:
= = = = =
| |||||||||||

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి