25, మార్చి 2019, సోమవారం

హేమమాలిని (Hema Malini)

జననంఅక్టోబరు 16, 1948
రంగంసినీనటి, రాజకీయాలు
అవార్డులుఫిలింఫేర్ అవార్డు, పద్మశ్రీ
సినీనటిగా, దర్శకురాలిగా, రాజకీయనాయకురాలిగా పేరుపొందిన హేమమాలిని అక్టోబరు 16, 1948న తమిళనాడులోని అమ్మన్‌కూడిలో జన్మించింది. భరతనాట్యంలో కూడా శిక్షణ పొందిన హేమమాలిని 1962లో తమిళ సినిమా ద్వారా సినీప్రస్థానం ప్రారంభించింది. హేమమాలిని ప్రధానపాత్ర పోషించిన తొలి సినిమా సప్నోంకా సౌదాగర్ (1968). బాలీవుడ్‌లో డ్రీమ్‌గర్ల్‌గా పేరుపొందిన హేమమాలిని మొత్తం 150కి పైగా సినిమాలలో నటించింది. 1980లో హేమమాలిని ధర్మేంద్రను వివాహం చేసుకుంది.

హేమమాలిని 1973లో సీతా ఔర్ గీతా సినిమాలో నటనకుగాను ఉత్తమనటిగా ఫిలింఫేర్ అవార్డు పొందింది. మొత్తం 11 సార్లు ఫిలింఫేర్ నామినేషన్లు పొందిననూ అవార్డు మాత్రం ఒక్కసారే లభించింది. 2000లో ఫిలింఫేర్ లైఫ్‌టైమ్‌ అచీవ్‌మెంట్ అవార్డు పొందింది. అదే సంవత్సరంలో హేమమాలిని భారతప్రభుత్వం నుంచి పద్మశ్రీ పురస్కారం కూడా పొందింది. 2013లో ఎన్టీఆర్ జాతీయ అవార్డు స్వీకరించింది.

2003లో హేమమాలిని రాష్ట్రపతిచే నామినేట్ అయి 2009 వరకు రాజ్యసభ సభ్యులుగా కొనసాగారు. 2014లో మధుర లొక్‌సభ నియోజకవర్గం నుంచి భాజపా తరఫున లోక్‌సభకు ఎన్నికయ్యారు.


ఇవి కూడా చూడండి:



విభాగాలు: భారతదేశ ప్రముఖ మహిళలు సినీనటులు, తమిళనాడు ప్రముఖులు,


 = = = = =


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి