సినీనటిగా మరియు రాజకీయ నాయకురాలిగా పేరుపొందిన జయప్రద ఏప్రిల్ 3, 1962న రాజమండ్రిలో జన్మించారు. జయప్రద అసలుపేరు లలితారాణి. 1974లో సినీరంగంలో ప్రవేశించిన జయప్రద తన సినీజీవితంలో 3 సార్లు ఫిలింఫేర్ (సౌత్) అవార్డులు పొందడమే కాకుండా పలుసార్లు ఫిలింఫేర్ అవార్డూలకు నామినేట్ అయ్యారు. తెలుగు, హిందీతో పాటు దక్షిణ భారతీయ భాషా చిత్రాలలో కూడా నటించారు. జయప్రద నటించిన తెలుగు సినిమాలలో అంతులేనికథ (1976), అడవి రాముడు (1977), యమగోల(1977), సిరిసిరిమువ్వ (1978), సాగరసంగమం (1983) ప్రేక్షకాదరణ పొందాయి. సాగరసంగమంలో నటనకుగాను ఉత్తమనటిగా ఫిలింఫేర్ అవార్డు లభించగా సిరిసిరిమువ్వ మరియు అంతులేనికథలలో నటనకుగాను ఫిలింఫేర్ స్పెషల్ అవార్డు పొందారు. 1976లో అంతులేని కథ సినిమాలో నటనకుగాను తొలిసారి నంది అవార్డు పొందారు.
రాజకీయాలు: 1994లో ఎన్టీరామారావు పిలుపుతో తెలుగుదేశం పార్టీ ద్వారా జయప్రద రాజకీయాలలో ప్రవేశించారు. తెలుగుదేశం పార్టీ సంక్షోభసమయంలో చంద్రబాబునాయుడు తరఫున ఉండి 1996లో తెలుగుదేశం పార్టీ తరఫున రాజ్యసభకు ఎన్నికయ్యారు. ఇదే సమయంలో తెలుగు మహిళ అధ్యక్షురాలిగా కూడా పనిచేశారు. ఆ తర్వాత చంద్రబాబునాయుడుతో విబేధాలు ఏర్పడి సమాజ్‌వాది పార్టీలో ప్రవేశించారు. 2004 మరియు 2009లలో రాంపూర్ (ఉత్తరప్రదేశ్) నుంచి సమాజ్‌వాది పార్టీ తరఫున లోక్‌సభకు ఎన్నికయ్యారు. 2014లో బిజ్నోర్ నుంచి రాష్ట్రీయ లోక్‌దళ్ తరఫున పోటీచేసి ఓడిపోయారు. పురస్కారాలు: నంది అవార్డు (1974) అంతులేనికథ సినిమాకై ఫిలింఫేర్ అవార్డులు (సౌత్) స్పెషల్ అవార్డు - సిరిసిరిమువ్వ & అంతులేనికథ (1976), ఉత్తమనటి - సాగరసంగమం (1983), లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ (సౌత్) (2007) ఇవి కూడా చూడండి:
= = = = =
| |||||||||||

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి