కేంద్రమంత్రిగా, గోవా ముఖ్యమంత్రిగా పనిచేసిన మనోహర్ పారికర్ డిసెంబరు 13, 1955న గోవాలోని మపుసాలో జన్మించారు. ముంబాయి ఐఐటి నుంచి ఇంజనీరింగ్‌లో పట్టభద్రుడైన పారికర్ గోవా శాసనసభకు ఎన్నికై ఐఐటి డిగ్రీతో ఎమ్మెల్యే అయిన తొలి వ్యక్తిగా అవతరించారు. ఆ తర్వాత గోవా మంత్రిగా, కేంద్రంలో నరేంద్రమోడి మంత్రివర్గంలోనూ పనిచేసి 2017లో గోవా ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. గోవా ముఖ్యమంత్రిగా పనిచేస్తూ మార్చి 17, 2019న మరణించారు.
రాజకీయ ప్రస్థానం: ప్రారంభం నుంచే రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్‌లో ఉన్న పారికర్ 1994లో తొలిసారి భాజపా తరఫున గోవా శాసనసభకు ఎన్నికయ్యారు. అదే సమయంలో ప్రతిపక్షనేతగా కూడా వ్యవహరించారు. 2000లో తొలిసారిగా గోవా ముఖ్యమంత్రిగా పదవి చేపట్టి 2005 వరకు పనిచేశారు. 2014లో నరేంద్రమోడి ప్రధానమంత్రి అయ్యాక పారికర్‌కు కేంద్ర మంత్రివర్గంలో స్థానం లభించింది. 2017లో గోవా శాసనసభ ఎన్నికలలో భాజపాకు పూర్తి మెజారిటీ రాకపోవడంతో సమర్థుడైన పారికర్‌ను ముఖ్యమంత్రి పదవి చేపట్టుటకై మళ్ళీ రాష్ట్రానికి పంపించారు. మార్చి 2018 నుంచి ఆరోగ్య సమస్యలపై పలుసారు ఆసుపత్రికి వెళ్ళవలసి వచ్చింది. మార్చి 17, 2019న పాంక్రియాటిక్ కాన్సర్ వ్యాధితో మరణించారు. ఇవి కూడా చూడండి:
= = = = =
| |||||||||||

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి