17, మార్చి 2019, ఆదివారం

వై.ఎస్.వివేకానందరెడ్డి (Y.S.Vivekananda Reddy)

జననంఆగస్టు 8, 1950
పదవులురాష్ట్ర మంత్రి, 3 సార్లు ఎమ్మెల్యే, 2 సార్లు ఎంపి
మరణంమార్చి 15, 2019
ఆంధ్రప్రదేశ్‌కు చెందిన రాజకీయ నాయకుడు వై.ఎస్.వివేకానందరెడ్డి ఆగస్టు 8, 1950న కడప జిల్లా పులివెందులలో జన్మించారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పనిచేసిన వై.ఎస్.రాజశేఖర్ రెడ్డి సొదరుడైన వివేకానందరెడ్డి 3 సార్లు ఎమ్మెల్యేగా, 2 సార్లు ఎంపీగా, రాష్ట్ర మంత్రిగా పనిచేశారు. మార్చి 15, 2019న హత్యకు గురయ్యారు.

రాజకీయ ప్రస్థానం:
కడప జిల్లాలోని లింగాల కాలువ డిజైన్ చేసిన ప్రముఖుడిగా పేరుపొందిన వివేకానందరెడ్డి లయన్స్ క్లబ్ ద్వారా సామాజిక సేవలందించి సమితి అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. 1989, 1994లలో పులివెందుల నియోజకవర్గం నుంచి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాసనసభకు ఎన్నికయ్యారు. 1999లో కడప నియోజకవర్గం నుంచి 90 వేలకుపైగా మెజారిటీతో లోక్‌సభకు ఎన్నికయ్యారు. 2004లో 1,10,000 మెజారిటీతో మళ్ళీ విజయం సాధించారు. 2009లో శాసనసభకు ఎన్నికై 2010లో నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి మంత్రివర్గంలో వ్యవసాయ శాఖ మంత్రిగా పదవి పొందారు. 2011లో పులివెందుల నుంచి ఉప ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీచేసి వై.ఎస్.విజయమ్మ చేతిలో ఓడిపోయారు.

ఇవి కూడా చూడండి:

హోం,
విభాగాలు: ఆంధ్రప్రదేశ్ రాజకీయ నాయకులు, కడప జిల్లా రాజకీయ నాయకులు, 2019లో మరణించినవారు,


 = = = = =


Biography of Y.S.Vivekananda Reddy

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి