5, మార్చి 2019, మంగళవారం

రాజబాబు (Raja Babu)

జననంఅక్టోబరు 20, 1937
రంగంసినీనటుడు
గుర్తింపులు10 నంది అవార్డులు, 15 ఫిలింఫేర్ అవార్డులు
మరణంఫిబ్రవరి 14, 1983
సినీనటుడిగా, కమేడియన్‌గా, నిర్మాతగా ప్రసిద్ధి చెందిన రాజబాబు అక్టోబరు 20, 1937న రాజమండ్రిలో జన్మించారు. ఈయన అసలుపేరు పుణ్యమూర్తుల అప్పలరాజు. ప్రారంభంలో నాటకాలలో నటించి సమాజం (1980) సినిమా ద్వారా రాజబాబు సినీరంగంలో ప్రవేశించారు. తెలుగు సినిమారంగంలో హాస్యనటుడిగా తనదైన ముద్రవేసిన రాజబాబు తన సినీజీవితంలో 10 నంది అవార్డులు, 15 ఫిలింఫేర్ అవార్డులు (సౌత్) పొందారు. అంతస్తులు సినిమా ద్వారా ప్రసిద్ధిచెందిన రాజబాబు రమప్రభ జోడితో (హాస్యనటులుగా) వచ్చిన సినిమాలు ప్రేక్షకాదరణ పొందాయి.

స్వయంగా రాజబాబు బాబ్ & బాబ్ ప్రొడక్షన్స్ అన్న నిర్మాణ సంస్థ స్థాపించి పలు చిత్రాలు కూడా తీశారు. ప్రముఖ రచయిత శ్రీశ్రీ మరదలు అయిన అమ్ముల లక్ష్మీని రాజబాబు 1965లో వివాహం చేసుకున్నారు. రాజబాబు చివరి సినిమా గడసరి అత్త సొగసరి కోడలు. రాజబాబు ఫిబ్రవరి 14, 1983న హైదరాబాదులో మరణించారు.

ఇవి కూడా చూడండి:


విభాగాలు: తెలుగు సినిమా నటులు, నంది అవార్డు గ్రహీతలు, పశ్చిమగోదావరి జిల్లా,


 = = = = =


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి