5, మార్చి 2019, మంగళవారం

బాబూమోహన్ (Babu Mohan)

జననంమార్చి 19, 1952
రంగంసినీనటుడు, రాజకీయాలు
పదవులురాష్ట్రమంత్రి
నియోజకవర్గంఆందోల్
సినీనటుడిగా రాజకీయ నాయకుడిగా ప్రసిద్ధి చెందిన బాబూమోహన్ మార్చి 19, 1952న ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండలం బీరోలులో జన్మించారు. బాబూమోహన్ పూర్తిపేరు కస్తూరిబాబు మోహన్ రావు. ఈ ప్రశ్నకు బదులేది సినిమా ద్వారా సినీరంగం చేసిన బాబూమోహన్ మామగారు సినిమా ద్వారా మంచిపేరు తెచ్చుకున్నారు. ఆ తర్వాత మాయలోడు, రాజేంద్రుడు గజేంద్రుడు, పెదరాయుడు, జంబలకిడి పంబ తదితర చిత్రాలు కూడా ఈయనకు పేరు వచ్చింది.

ఎన్టీరామారావుపై అభిమానంతో తెలుగుదేశం పార్టీలో చేరి తొలిసారి 1999లో ఆందోల్ నియోజకవర్గం నుంచి గెలుపొందారు. అదేసమయంలో ఈయన రాష్ట్రమంత్రివర్గంలో కార్మికశాఖ మంత్రిగా పనిచేశారు. 2004, 2009లలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి దామోదర రాజనర్సింహ చేతిలో పరాజయం పొందారు. 2014లో తెరాస తరఫున పోటీచేసి రెండోసారి శాసనసభల్ అడుగుపెట్టారు. 2018 ముందస్తు ఎన్నికల సమయంలో తెరాస పార్టీ టికెట్ కేటాయించకపోవడంతో భాజపాలో చేరి ఆ పార్టీ తరఫున పోటీచేసి తెరాసకు చెందిన క్రాంతికుమార్ చేతిలో పరాజయం పొందారు.

ఇవి కూడా చూడండి:

విభాగాలు: తెలుగు సినిమా నటులు, ఆంధ్రప్రదేశ్ మంత్రులు, ఖమ్మం జిల్లా ప్రముఖులు, తెలంగాణ రాజకీయ నాయకులు,


 = = = = =


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి