ఖమ్మం జిల్లా తెలంగాణ రాష్ట్రంలోని 33 జిల్లాలలో ఒకటి. జిల్లాలో 21 మండలాలు, 379 రెవెన్యూ గ్రామాలు, 584 గ్రామపంచాయతీలు కలవు. ముఖ్యమంత్రిగా పనిచేసిన జలగం వెంగళరావు, సమరయోధులు జమలాపురం కేశవరావు, నల్లమల గిరిప్రసాద్, చేకూరి రామారావు, బోడేపల్లి వెంకటేశ్వరరావు, కొండుభట్ల సుబ్రహ్మణ్యశాస్త్రి ఈ జిల్లాకు చెందిన ప్రముఖులు. గోదావరి నది జిల్లా గుండా ప్రవహిస్తున్నది. వైరా, పాలేరు, కిన్నెరసాని, తాలిపేరు ప్రాజెక్టులు జిల్లాలో కలవు. 2011 ప్రకారం జిల్లా జనాభా 14,01,639. ఖమ్మం, జిల్లాలోని ముఖ్య పట్టణాలు. జిల్లా వైశాల్యం 4361 చదరపు కిలోమీటర్లు. భౌగోళికం, సరిహద్దులు: ఖమ్మం జిల్లాకు ఉత్తరాన మహబూబాబాదు జిల్లా మరియు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలు, పశ్చిమాన సూర్యాపేట జిల్లా, దక్షిణాన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సరిహద్దులుగా ఉన్నాయి.. చరిత్ర: మొదట ఖమ్మం జిల్లా వరంగల్ జిల్లాలో భాగంగా ఉండేది. 1925లో మొదటి గ్రంథాలయ మహాసభ మధిరలో జరిగింది. 1953లో ఖమ్మం ప్రత్యేక జిల్లాగా ఏర్పడింది. 1956లో హైదరాబాదు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్‌లో కలిసిన పిదప తూర్పు గోదావరి జిల్లాలోని నూగూరు, భద్రాచలం తాలుకాలు ఖమ్మం జిల్లాలో కలుపబడినవి. 1969లో తొలిదశ తెలంగాణ ఉద్యమం జిల్లాలో ఉధృతంగా సాగింది. 2009-14 కాలంలో మలిదశ తెలంగాణ ఉద్యమంలో విద్యార్థులు, ఉద్యోగులు, కళాకారులు, కార్మికులు, న్యాయవాదులు, మహిళలు స్వచ్ఛందంగా పాల్గొన్నారు. 2011లో 42 రోజుల పాటు సకలజనుల సమ్మె సంపూర్ణంగా జరిగింది. 2014, జూన్ 2న ఖమ్మం జిల్లా తెలంగాణలో భాగమైన తర్వాత పోలవరం ముంపును గురయ్యే 7 మండలాలు (2 పాక్షిక) ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తరలించారు. అక్టోబరు 11, 2016న జిల్లాల పునర్వ్యవస్థీకరణ సమయంలో ఖమ్మం జిల్లా తూర్పు భాగం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాగా అవతరించింది. రవాణా సౌకర్యాలు:
డోర్నకల్ నుంచి విజయవాడ వెళ్ళు రైలుమార్గం మరియు డోర్నకల్ నుంచి సింగరేణి మార్గం జిల్లా గుండా వెళ్తున్నాయి. ఖమ్మం, మధిర, ఎర్రుపాలెం, బోనకల్, కారేపల్లి, చింతకాని, తొండల గోపవరం జిల్లాలోని ముఖ్యమైన రైల్వేస్టేషన్లు. ఇవి దక్షిణమధ్యరైల్వేలో భాగంగా సికింద్రాబాదు డీవిజన్ పరిధిలోకి వస్తాయి. ఖమ్మం నుంచి ప్రధాన పట్టణాలకు రోడ్డు మార్గాలున్నాయి. ఖమ్మం, మధిర, సత్తుపల్లిలలో తెలంగాణ రోడ్డు రవాణాసంస్థకు చెందిన ఆర్టీసి డీపోలున్నాయి.
= = = = =
|
19, జులై 2014, శనివారం
ఖమ్మం జిల్లా (Khammam Dist)
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
Index
తెలుగులో విజ్ఞానసర్వస్వము
|
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు, సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, వార్తలు, సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు, |
విభాగాలు: |
------------
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి