ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా, స్పీకరుగా పనిచేసిన నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి సెప్టెంబరు 13, 1960న హైదరాబాదులో జన్మించారు. ఈయన స్వస్థలం చిత్తూరు జిల్లా నగిరిపల్లె. కిరణ్ కుమార్ రెడ్డి క్రీడాకారునిగా, రాజకీయ నాయకుడిగా ప్రసిద్ధిచెందారు. అండర్-22 సౌత్ జోన్ విశ్వవిద్యాలయాల టోర్నీకి హైదరాబాదు జట్టు కెప్టెన్‌గా వ్యవహరించారు. రాష్ట్ర మంత్రిగా పనిచేసిన తండ్రి నల్లారి అమర్‌నాథ్ రెడ్డి మరణానంతరం రాజకీయాలలో ప్రవేశించి 4 సార్లు ఎమ్మెల్యేగా, స్పీకరుగా, ముఖ్యమంత్రిగా పనిచేశారు.
రాజకీయ ప్రస్థానం: తండ్రి నల్లారి అమర్‌నాథ్ రెడ్డి పి..వి.నరసింహరావు హయంలో రాష్ట్రమంత్రిగా పనిచేశారు. ఈయన మరణానంతరం కిరణ్ కుమార్ రెడ్డి 1989లో తొలిసారి వాయల్పాడు శాసనసభ స్థానం నుంచి శాసనసభకు ఎన్నికయ్యారు. 1994లో ఓడిపోయిననూ 1999, 2004లలో కూడా వాయల్పాడు నుంచి ఎన్నికయ్యారు. 2004-09 కాలంలో వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ చీఫ్ విప్‌గా పనిచేశారు. నియోజకవర్గాల పునర్విభజన తర్వాత 2009లో పీలేరు శాసనసభ స్థానం నుంచి విజయం సాధించి 2009-10 కాలంలో ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకరుగా పనిచేశారు. 2010లో కె.రోశయ్య తర్వాత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి 2014 వరకు పనిచేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు ఈయనే చివరి ముఖ్యమంత్రి. ఈయన ముఖ్యమంత్రి కాలంలో మీసేవ, రాజీవ్ యువకిరణాలు, బంగారు తల్లి పథకం లాంటి పథకాలను ప్రారంభించారు. ప్రత్యేక తెలంగాణ ఏర్పాటుకు నిరసిస్తూ 2014 ఫిబ్రవరిలో కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి మార్చి 2014లో రాజమండ్రిలో జై సమాఖ్యాంధ్ర పార్టీని స్థాపించారు. జూలై 2018లో మళ్ళీ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఇవి కూడా చూడండి:
= = = = =
|
4, జులై 2020, శనివారం
నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి (Nallari Kiran Kumar Reddy)
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
Index
తెలుగులో విజ్ఞానసర్వస్వము
|
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు, సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, వార్తలు, సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు, |
విభాగాలు: |
------------
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి