3, ఏప్రిల్ 2019, బుధవారం

కుల్చారం మండలం (Kulcharam Mandal)

కుల్చారం మండలం
జిల్లా మెదక్
రెవెన్యూ డివిజన్ నర్సాపూర్
అసెంబ్లీ నియోజకవర్గంనర్సాపూర్
లోకసభ నియోజకవర్గంమెదక్
కుల్చారం  మెదక్ జిల్లాకు చెందిన మండలము. వందేళ్ళ క్రితం నిర్మించిన ఘన్‌పూర్ ఆనకట్ట మండల పరిధిలో ఉంది. మండలంలో 21 రెవెన్యూ గ్రామాలు కలవు. ఈ మండలం నర్సాపూర్ రెవెన్యూ డివిజన్, నర్సాపుర్ అసెంబ్లీ నియోజకవర్గం, మెదక్ లోకసభ నియోజకవర్గంలో భాగంగా ఉన్నది.

భౌగోళికం, సరిహద్దులు:
ఈ మండలానికి తూర్పున ఎల్దుర్తి మండలం, దక్షిణాన కౌడిపల్లి మండలం, పశ్చిమాన టేక్మల్ మండలం, ఉత్తరాన పాపన్నపేట మండలం, ఈశాన్యాన మెదక్ మండలం, నైరుతిన సంగారెడ్డి జిల్లా సరిహద్దులుగా ఉన్నాయి. మండలం గుండా మంజీరానది ప్రవహిస్తుంది.

జనాభా:
2011 లెక్కల ప్రకారం మండల జనాభా 35881. ఇందులో పురుషులు 17512, మహిళలు 18369. అక్షరాస్యుల సంఖ్య 17268. స్త్రీపురుష నిష్పత్తిలో (1049/వెయ్యి పురుషులకు) ఈ మండలం జిల్లాలో మూడవ స్థానంలో ఉంది.

రాజకీయాలు:
ఈ మండలం నర్సాపుర్ అసెంబ్లీ నియోజకవర్గం, మెదక్ లోకసభ నియోజకవర్గంలో భాగంగా ఉన్నది.

మండలంలోని రెవెన్యూ గ్రామాలు:
Amsanpally, Appajipally, Chinnaghanpur, Etigadda Mahmmadapur, Kistapur, Konapur, Kongode, Kulcharam, Nainjalalpur, Paithara, Pothamsettipally, Pothireddipally, Rampur, Rangampet, Sangaipet, Serivariguntham, Thukkapur, Tummalapally, Variguntham, Venkatapur, Yenigandla

ప్రముఖ గ్రామాలు

చిన్న ఘన్‌పూర్ (China Ghanpur):

ఈ గ్రామపరిధిలో మంజీరానదిపై 1905లో ఆనకట్ట నిర్మించబడింది.

ఇవి కూడా చూడండి:



ఫోటో గ్యాలరీ
c
c
c c


హోం
విభాగాలు: మెదక్ జిల్లా మండలాలు,  కుల్చారం  మండలము,
= = = = =
సంప్రదించిన పుస్తకాలు, వెబ్‌సైట్లు:
  • Handbook of Statistics, Medak Dist, 2016,
  • Handbook of Census Statistics, Medak District, 2011,
  • Census of India 2011, Provistional Population Totals, Part 2, Volume 2 of 2011.
  • బ్లాగు రచయిత సందర్శించి తెలుసుకున్న, సేకరించిన సమాచారం,
  • తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ GO Ms No 238 తేది: 11-10-2016 
  • మెదక్ జిల్లా స్వాతంత్ర్యసమరయోధుల చరిత్ర


Kowdipally Mandal Medak Dist (district) Mandal in telugu, Medak Dist Mandals in telugu,

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి