గణిత మేధావిగా, రచయిత్రిగా పేరుపొందిన శకుంతలాదేవి నవంబరు 4, 1929న బెంగళూరు (కర్ణాటక) లో జన్మించారు. చిన్న వయస్సు నుంచే గణితంలో ప్రతిభ ప్రదర్శించి పలు ప్రదర్శనలు ఇచ్చారు. దేశ విదేశాలలోని పలు విశ్వవిద్యాలయాలలో గణిత ప్రదర్శలతో మన్నలలందుకున్నారు. తన అపారమైన గణితమేధస్సుతో 1980లో లండన్ లోని ఇంపీరియల్ కాలేజీలో ఇచ్చిన గణిత ప్రదర్శన హ్యూమన్ కంప్యూటర్‌గా పేరు సంపాదించారు. రెండు 13 అంకెల గుణకారాన్ని కేవలం 28 సెకన్లలోనే గణించి అందరినీ ఆశ్చర్యపర్చడమే కాకుండా ప్రపంచరికార్డుగా గిన్నిస్ బుక్‌లో స్థానం పొందారు. (97,686,369,774,870 × 2,465,099,745,779 = 18,947,668,177,995,426,462,773,730). శకుంతలాదేవి ఏప్రిల్ 21, 2012న బెంగళూరులో మరణించారు.
శకుంతలాదేవికి 1960లో ఐఏఎస్ అధికారి హరితోష్ ముఖర్జీతో వివాహమైంది. కాని కొంతకాలానికే విడిపోయారు. భర్త హోమోసెక్సువల్, ఆ అనుభవంతో శకుంతలాదేవి "ద వరల్డ్ ఆఫ్ హోమో సెక్సువల్స్" పుస్తకం రాశారు. శకుంతలాదేవి ఇతర రచనలు: ఫన్ విత్ నంబర్స్, ఆస్ట్రాలజీ ఫర్ యూ, పజిల్స్ టు పజిల్స్. 1975లో ఇందిరాగాంధీ విధించిన అత్యవసర పరిస్థితిని వ్యతిరేకించిన శకుంతలాదేవి 1980లో మెదక్ నుంచి ఇందిరాగాంధీపై పోటీచేశారు. 2020లో దర్శకుడు అనూమీనన్ శకుంతలాదేవి జీవితం ఆధారంగా బయోపిక్ నిర్మించారు. ఇందులో శకుంతలాదేవి పాత్రధారి విద్యాబాలన్. ఇవి కూడా చూడండి:
= = = = =
| |||||||||||

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి