దక్షిణ భారతదేశంలోనే రెండో పెద్దదైన మహాత్మాగాంధీ బస్ స్టేషన్ హైదరాబాదులో గౌలిగూడ ప్రాంతంలో మూసీనది తీరాన 20 ఎకరాల విస్రీర్ణంలో ఉంది. సంక్షిప్తంగా ఎంజీబీఎస్ గా పిల్వబడుతున్న ఈ బస్ స్టేషన్ నిర్మాణానికి 1988లో ఎన్టీ రామారావుచే శంకుస్థాపన చేయబడగా, ఆగస్టు 17, 1994న కోట్ల విజయభాస్కర్ రెడ్డిచే ప్రారంభించబడింది. 1994లో ఈ బస్ స్టేషన్ ప్రారంభించేవరకు నిజాం కాలంలో డోమ్ ఆకారంలో నిర్మించిన ఇమ్లిబన్ బస్ స్టేషన్ ప్రయాణీకులకు సేవలందించింది. ఎంజీబీఎస్ వద్దే మెట్రో స్టేషన్ కూడా ఉంది. బస్ స్టేషన్‌లో 79+ ప్లాట్‌ఫాంలు కలవు. ఇవి కూడా చూడండి:
= = = = =
|
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి