19, నవంబర్ 2020, గురువారం

హైదరాబాదు (Hyderabad)

స్థాపన
క్రీ.శ.1591
రాష్ట్రం
తెలంగాణ
జనాభా
68 లక్షలు (2011)
వైశాల్యం
625 చకిమీ
భారతదేశంలోనే ప్రముఖ నగరాలలో ఒకటైన హైదరాబాదు తెలంగాణ రాష్ట్ర రాజధానిగా ఉంది. భాగ్యనగర్ అని కూడా పిల్వబడే ఈ నగరం సాఫ్ట్‌వేర్ రంగంలో పేరుగాంచింది. సికింద్రాబాదు హైదరాబాదుకు జంటనగరం. క్రీ.శ.1591లో కులీ కుతుబ్ షాచే నిర్మించబడిన హైదరాబాదు దినదినాభివృద్ధి చెంది 2011 లెక్కల ప్రకారం 68 లక్షల జనాభాకు కల్గియుంది. కృష్ణానదికి ఉపనది అయిన మూసీనది నగరం గుండా ప్రవహిస్తోంది. బిర్లామందిర్, గోల్కొండ కోట, చార్మినార్, నెహ్రూ జూపార్క్, దుర్గంచెరువు, రామోజీ ఫిలింసిటి, సాలార్జంగ్ మ్యూజియం నగరంలోని ప్రముఖ పర్యాటక ప్రాంతాలు.
 
భౌగోళికం:
హైదరాబాదు నగరం ద్వీపకల్ప బారతదేశంలో దాదాపు మధ్యబాగంలో ఉంది. నగరం గుండా మూసీనది ప్రవహిస్తోంది. సముద్రమట్టం నుంచి సుమారు 541 మీ ఎత్తున ఉంది. నగర వైశాల్యం 625 చకిమీ. హుస్సేన్ సాగర్, హిమాయత్ సాగర్ నగరంలోని ప్రధాన చెరువులు. హైదరాబాదు జిల్లా పూర్తిగా మరియు మేడ్చల్, రంగారెడ్డి, సంగారెడ్డి జిల్లాలలో పాక్షికంగా వ్యాపించియుంది. 2011 లెక్కల ప్రకారం హైదరాబాదు జనాభా 68 లక్షలు.

చరిత్ర:
క్రీ.శ.1591లో మహమ్మద్ కులీ కుతుబ్ షా హైదరాబాదు నిర్మాతగా పేరుపొందాడు. అదివరకు కుతుబ్‌షా పాలకులకు గోల్కొండ రాజధానిగా ఉండేది. రాజధానిని హైదరాబాదుకు మార్చిన పిదప చార్మినార్ నిర్మించబడింది. కుతుబ్‌షాహీలు, మొఘలులు, నిజాంషాహీలు హైదరాబాదు కేంద్రంగా పాలించారు. నిజాం కాలంలో 1908లో మూసీనది వరదల వల్ల అపార ప్రాణ, ఆస్తినష్తం జరిగింది. 1948 సెప్టెంబరు 17న విమోచనోద్యం వల్ల మరియు సర్దార్ పటేళ్ సాహసంతో చేపట్టిన ఆపరేషన్ పోలో వల్ల నిజాం పాలన అంతమై భారత యూనియన్‌లో విలీనమైంది. 1956లో ఆంధ్రప్రదేశ్‌లో కలిసే వరకు హైదరాబాదు రాష్ట్ర రాజధానిగా ఉండింది. 1956-2014 కాలంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజధానిగా కొనసాగి జూన్ 2, 2014లో ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కావడంతో తెలంగాణ రాష్ట్ర రాజధానిగా కొనసాగుతోంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఉన్నప్పుడు 1969లో మరియు 2009-14 కాలంలో ప్రత్యేక తెలంగాణ ఉద్యమం ఉధృతంగా సాగింది. ఈ పోరాటంలో ఉస్మానియా విశ్వవిద్యాలయం విద్యార్థులు ప్రముఖపాత్ర పోషించారు. పలు విద్యార్థులు ప్రాణత్యాగం చేసి అమరులైనారు.

నగర పాలన:
హైదరాబాదు నగర పాలన గ్రేటర్ హైదరాబాదు నగరపాలక సంస్థ (GHMC)చే సాగుతుంది. నగరపాలక సంస్థ 6 జోన్లుగా, 30 సర్కిళ్ళుగా, 150 వార్డులుగా విభజించబడి ఉంది. 2007లో పరిసర పురపాలక సంఘాలను విలీనంచేసి గ్రేటర్‌గా చేయబడింది.

రవాణా సౌకర్యాలు:
హైదరాబాదుకు చెందిన విమానాశ్రయం శంషాబాదులో ఉంది. ఇది రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంగా పిల్వబడుతుంది. సికింద్రాబాదు ప్రముఖ జంక్షన్ మరియు దక్షిణమధ్య రైల్వే జోన్ ప్రధానకేంద్రము గానూ ఉంది. సికింద్రాబాదు, నాంపల్లి, కాచిగూడ నుంచి దేశంలోని ప్రధాన నగరాలకు రైళ్ళు ప్రయాణిస్తాయి. నగరంలో ఎంఎంటీఎస్ మరియు మెట్రో రైలు కూడా ప్రజలకు అందుబాటులో ఉంది. జాతీయ రహదారి సంఖ్య 44, 65, 202 నగరం గుండా వెళ్ళుచున్నాయి. నగరంలో ప్రధాన బస్‌స్టేషన్ మహాత్మాగాంధీ బస్‌స్టేషన్. ఉత్తరాది జిల్లాకు వెళ్ళే బస్సులు జూబ్లీ బస్ స్టేషన్ నుంచి వెళ్తుంటాయి.

విద్య:
1918లోనే హైదరాబాదులో ఉస్మానియా విశ్వవిద్యాలయం స్థాపించబడింది. నిజాం కళాశాల తెలంగాణలోనే అతి పురాతనమైన కళాశాల. అఘోరనాథ చటోపాధ్యాయ ఈ కళాశాల ప్రిన్సిపాల్‌గా పనిచేశారు. హైదరాబాదు కేంద్రీయ విశ్వవిద్యాలయం మరియు ఇతర పలు విశ్వవిద్యాలయాలు నగరంలో ఉన్నాయి.
 
 
ఇవి కూడా చూడండి:


హోం
విభాగాలు: భారతదేశ రాష్ట్రాలు-రాజధానులు, తెలంగాణ, హైదరాబాదు,


 = = = = =


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు,

      విభాగాలు: 
      ------------ 

      stat coun

      విషయసూచిక