దక్షిణ భారతదేశానికి చెందిన ప్రముఖ గాయనిగా పేరుపొందిన వాణి జయరాం నవంబరు 30, 1945న తమిళనాడులోని వెల్లూరులో జన్మించారు. ఈమె అసలుపేరు కలైవాణి. (1969లో వివాహం తర్వాత భర్త జయరాం పేరు జత అయింది). 1971లో తొలిసారిగా హిందీ సినిమా "గుడ్డి" ద్వారా సినీగాయనిగా ప్రస్థానం ఆరంభించి 4 దశాబ్దాలపాటు గాయనిగా రాణించింది. వాణి జయరాం 4 దశాబ్దాల తన సినీకెరీర్‌లో వెయ్యికి పైగా సినిమాలలో పాటలు పాడింది. ఇతర భక్తిగానాలు, ప్రైవేట్ అల్బమ్స్ కలిపి 20వేలకు పైగా పాటలు పాడింది. 3 సార్లు ఉత్తమ గాయనిగా జాతీయ ఫిలింఫేర్ అవార్డు మరియు ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, ఒరిస్సా రాష్ట్రాల సినీ అవార్డులు పొందింది. 2012లో ఫిలింఫేర్ లైఫ్‌టైం అచీవ్‌మెంట్ అవార్డు లభించింది.
సినీప్రస్థానం: 1971లో వాణి జయరాం పాడిన తొలి పాట హృషికేశ్ ముఖర్జీ దర్శకత్వంలోని "గుడ్డి" (1971) సినిమాలోనిది. ఈమె పాడిన తొలి తెలుగు సినిమా "అభిమానవంతులు" (1973). 1975లో తమిళ సినిమా "అపుర్వ రాగాందల్" సినిమాలో పాటలకై తొలి సారిగా జాతీయ ఫిలింఫేర్ అవార్డు లభించింది. 1975లో "పూజ" సినిమా ఈమెకు మంచి గుర్తింపు ఇచ్చింది. హిట్ సాంగ్‌గా పేరుపొందిన "ఎన్నెన్నో జన్మల బంధం నీదీ నాదీ ..." పాట ఈ సినిమాలో ఉంది. 1976లో కె.విశ్వనాథ్ తీసిన "శంకరాభరణం" సినిమా పాటలు ఈమె గుర్తింపును అధికం చేశాయి. శంకరాభరణం సినిమా పాటలు జనాదరణ పొందడమే కాకుండా ఈ సినిమాకై వాణిజయరాంకు రెండోసారి జాతీయ ఫిలింఫేర్ అవార్డు లభించింది. 1990లో తీసిన "స్వాతికిరణం" సినిమా పాటలకై మూడోసారి జాతీయ ఫిలింఫేర్ అవార్డు పొందారు. ఇవి కూడా చూడండి:
= = = = =
|
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి