15, సెప్టెంబర్ 2014, సోమవారం

తమిళనాడు (Tamilnadu)

తమిళనాడు
రాజధానిచెన్నై
అధికార భాషతమిళం
వైశాల్యం1,30,058 చకిమీ
జనాభా (2011)7,21,47,030
దక్షిణ భారతదేశంలో బంగాళాఖాతం తీరాన ఉన్న రాష్ట్రం తమిళనాడు. కేరళ, కర్ణాటక, ఆంధ్ర ప్రదేశ్, పుదుచ్చేరిలు దీని సరిహద్దు రాష్ట్రాలు. తమిళనాడుకు ఆగ్నేయాన హిందూ మహాసముద్రంలో శ్రీలంక ద్వీప దేశం ఉంది. తమిళనాడు అధికార భాష తమిళం. ఈ రాష్ట్రరాజధాని చెన్నై. చెన్నై, కోయంబత్తూరు, కడలూరు, మదురై, తిరుచిరాపల్లి, సేలం, తిరునల్వేలి తమిళనాడు రాష్ట్రంలోని ముఖ్యమైన నగరాలు. ప్రముఖ గణిత శాస్త్రవేత్త శ్రీనివాస రామానుజన్, చెస్ క్రీడాకారుడు విశ్వనాథన్ ఆనంద్, రాజకీయ నాయకులు ఎం.జి.రామచంద్రన్, కరుణానిధి, జయలలిత, సమాయోధుడు మరియు కవి సుబ్రహ్మణ్య భారతి, సంగీత దర్శకుడు, ఆస్కార్ పురస్కార గ్రహీత ఏ.ఆర్.రెహమాన్ ఈ రాష్ట్రానికి చెందిన ప్రముఖులు. భారతదేశ చరిత్రలో ప్రముఖంగా పేరుపొందిన చోళ, చేర, పాండ్య వంశాలు ఈ ప్రాంతాన్ని పాలించారు. పూర్వం మద్రాసు రాష్ట్రంగా పిలువబడిన తమిళనాడులో బృహదీశ్వరాలయం, కంచి, రామేశ్వరం తదితర అధ్యాత్మిక క్షేత్రాలున్నాయి. రాష్ట్ర వైశాల్యం 1,30,058 చకిమీ మరియు 2011 ప్రకారం రాష్ట్ర జనాభా 7,21,47,030. రాష్ట్రంలో 32 జిల్లాలు, 39 లోకసభ స్థానాలు కలవు.

భౌగోళికం, సరిహద్దులు:
తమిళనాడు 130,058 చదరపు కిలోమీటర్ల వైశాల్యంలో దేశంలో 11వ పెద్ద రాష్ట్రంగా ఉంది. ఈ రాష్ట్రానికి పశ్చిమాన కేరళ, వాయువ్యాన కర్ణాటక, ఉత్తరాన కర్ణాటకతో పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు, తూర్పున బంగాళాఖాతం సరిహద్దులుగా ఉన్నాయి. 

రాజకీయాలు:
ఈ రాష్ట్రంలో ప్రాంతీయ పార్టీలే గత కొన్ని దశాబ్దాలుగా అధికారం చెలాయిస్తున్నాయి. డిఎంకె మరియు ఏఐఏడిఎంకె పార్టీలు ఇక్కడ బలమైన రాజకీయపక్షాలు. కాంగ్రెస్ పార్టీ ఒకప్పుడు అధికారం చెలాయించిన ఇప్పుడు ప్రాంతీయ పార్టీలతో పొత్తు పెట్టుకొనే పరిస్థితి ఉంది.

రవాణా సౌకర్యాలు:
రాష్ట్రంలోని ప్రముఖ నగరాలు, పట్టణాలను కలుపుతూ 5000 కిలోమీటర్ల పొడవైన 28 జాతీయ రహదారులున్నాయి. చెన్నై నగరం దక్షిణ రైల్వే ప్రధానకేంద్రంగాఉంది. చెన్నై, కోయంబత్తూర్, తిరుచిరాపల్లిలలో అంతర్జాతీయ విమానాశ్రయాలున్నాయి. చెన్నై, ఎన్నోర్ మరియు ట్యుటికోరన్‌లలో మేజర్ ఓడరేవులు కలవు.

క్రీడలు:
కబడ్డి ఆట ఈ రాష్ట్రంలోనే ఆవిర్భవించింది. ఇది రాష్ట్ర క్రీడగా గుర్తింపు పొందింది. అయిననూ క్రికెట్ ప్రజాదరణ క్రీడగా చెలామణి అవుతోంది. చెన్నైలోని చిదంబరం స్టేడియం అంతర్జాతీయ క్రికెట్ పోటీలకు ఆతిథ్యం ఇచ్చే దేశంలోని ప్రముఖ స్టేడియాలలో ఒకటి. వెంకటరాఘవన్, కృష్ణమాచారి శ్రీకాంత్, లక్ష్మణ్ శివరామకృష్ణన్ తదితరులు భారత క్రికెట్ జట్టుకు ప్రాతినిధ్యం వహించిన ఈ రాష్ట్ర ప్రముఖ క్రీడాకారులు. చెన్నై సూపర్ కింగ్స్ ఐపీఎల్‌లో ప్రముఖ ఫ్రాంఛైజీ మరియు 2 సార్లు విజేత. ప్రముఖ చదరంగ క్రీడాకారుడు, ప్రపంచ చాంపియన్ టైటిల్ సాధించిన విశ్వనాథన్ ఆనంద్, టెన్నిస్ క్రీడాకారులు రామనాథన్ కృష్ణన్, రమేష్ కృష్ణన్, విజయ్ అమృత్‌రాజ్, మహేష్ భూపతి, నిరుపమ వైద్యనాథన్‌లు ఈ రాష్ట్రానికి చెందినవారు.

విభాగాలు: భారతదేశ రాష్ట్రాలు, తమిళనాడు,


 = = = = =


వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ముఖ్యమంత్రులు-గవర్నర్లు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, హాస్యం, చరిత్రలో ఈ రోజు,

   విభాగాలు: 
   ------------ 

   stat coun

   విషయసూచిక