24, డిసెంబర్ 2020, గురువారం

యాసాల బాలయ్య (Yasala Balaiah)

జననం
1939
రంగం
చిత్రకళ
పురస్కారాలు
తెలంగాణ దినోత్సవం పురస్కారం
మరణం
డిసెంబరు 23, 2020
బాతిక్ చిత్రకళలో పేరుపొందిన యాసాల బాలయ్య 1939లో సిద్ధిపేట జిల్లా నారాయణరావుపేట మండలం ఇబ్రహీంపట్నంలో జన్మించారు. 1962లో ఆర్ట్ టీచరుగా జీవన ప్రస్థానం ఆరంబించి ఇండోనేషియా చిత్రకళ పద్దతి అయిన బాతిక్ కళలో పెయింటింగ్‌లను వేయడంలో పేరుపొంది బాతిక్ బాలయ్యగా పేరు సంపాదించారు.  తెలంగాణ తల్లి విగ్రహ రూపకల్పనలో కూడా పాల్గొన్నారు. 2016లో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ అవార్డు పొందారు. బాలయ్య డిసెంబరు 23, 2020న మరణించారు.

బాలయ్య తన చిత్రాలలో పల్లె జీవనాన్ని ముఖ్యంగా పల్లె మహిళల జీవనవిధానాన్ని ఉట్టిపడేలా చిత్రించారు. తన ప్రతిభతో 2003లో ఆలిండియా ఫైన్ ఆర్త్స్ అండ్ క్రాఫ్ట్ సొసైటీ (AIFACS)చే సన్మానం పొందారు. 1991లో పొట్టిశ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం నుంచి, 1994లో రాష్ట్రపతిచే జాతీయ స్థాయిలో ఉత్తమ ఉపాద్యాయులుగా అవార్డు పొందారు. బాలయ్య చిత్రాలు లాస్‌ఏంజిల్స్ మ్యూజియంలో, సాలార్జంగ్ మ్యూజియంలో, హైదరాబాద్ స్టేట్ మ్యూజియంలో, లలితకళా అకాడమీలో, చెన్నై మ్యూజియంలో ప్రదర్శితమౌతున్నాయి.

ఇవి కూడా చూడండి:


హోం
విభాగాలు: సిద్ధిపేట జిల్లా ప్రముఖులు, ప్రముఖ చిత్రకారులు,


 = = = = =


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి