6, సెప్టెంబర్ 2020, ఆదివారం

కాలరేఖ 2020 (Timeline 2020)

కాలరేఖ 2020 
 (Timeline 2020)
  • జనవరి 10: పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ) అమల్లోకి వచ్చింది
  • జనవరి 10:ఓమన్ సుల్తాన్ ఖబూస్ బిన్ సయీద్ మరణం
  • జనవరి 31: యునైటెడ్ కింగ్‌డమ్‌ యూర్పియన్ యూనియన్ నుంచి పూర్తిగా బయటపడింది 
  • ఫిబ్రవరి 8: ఢిల్లీ శాసనసభ ఎన్నికలు జరిగాయి
  • ఫిబ్రవరి 11: కరోనా వైరస్ వల్ల వచ్చు వ్యాధికి ప్రపంచ ఆరోగ్యసంస్థ కోవిడ్-19గా పేరుపెట్టించి
  • ఫిబ్రవరి 24: మలేషియా ప్రధాని మహతిర్‌ మహ్మద్‌ పదవికి రాజీనామా చేశారు
  • ఫిబ్రవరి 24: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్ వచ్చారు
  • ఫిబ్రవరి 25: ఏకీకృత రిజిస్ట్రేషన్ కార్డు(యూనిఫైడ్ వెహిక‌ల్ రిజిస్ట్రేష‌న్ కార్డ్)ను దేశంలో మొద‌టిసారి మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లో ప్రవేశపెట్టబడింది
  • ఫిబ్రవరి 25: ఈజిప్ట్ మాజీ అధ్యక్షుడు హోస్నీ ముబారక్‌ మరణం
  • ఫిబ్రవరి 27: స్వాతంత్య్ర సమరయోధుడు సుధాకర్‌ చతుర్వేది మరణం
  • ఫిబ్రవరి 28: భారత హాకీ మాజీ ఆటగాడు బల్బీర్‌ సింగ్‌ కుల్లర్‌ మరణం
  • ఫిబ్రవరి 29: ప్రజారవాణాను పూర్తిగా ఉచితంగా అందుబాటులోకి తెచ్చిన తొలి దేశంగా లక్సెంబర్గ్ అవతరించింది
  • మార్చి 1: అమెరికా, తాలిబన్‌ చరిత్రాత్మక శాంతి ఒప్పందంపై సంతకాలు పెట్టాయి
  • మార్చి 4: ఉత్తరాఖండ్‌ వేసవి రాజధానిగా గౌర్‌స్సేణ్‌ ఎంపిఅకచేశారు
  • మార్చి 4: ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన జేవియర్ పెరెజ్ డి క్యూల్లార్ మరణం
  • మార్చి 5: ఔరంగాబాద్ విమానాశ్ర‌యం పేరును ఛత్రపతి శంభాజీ మహారాజ్ ఏయిర్‌పోర్ట్ గా మార్చబడింది
  • మార్చి 5: ప్రముఖ పాత్రికేయుడు పొత్తూరి వెంకటేశ్వరరావు మరణం
  • మార్చి 8: కేంద్ర మాజీ మంత్రి హన్స్‌ రాజ్‌ భరద్వాజ్‌ మరణం
  • మార్చి 8: రాజకీయ నాయకుడు హన్స్‌రాజ్ భరధ్వాజ్ మరణం
  • మార్చి 13: గ్రీస్‌ తొలి మహిళా అధ్యక్షురాలిగా కాటెరినా సాకెల్లోపౌలో పదవి పొందారు

  • మార్చి 19: ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం కరోనా (కోవిడ్‌-19)ను జీవ విపత్తు (బయోలాజికల్‌ డిజాస్టర్‌)గా ప్ర‌క‌టించింది
  • మార్చి 20: ఫుట్‌బాల్ క్రీడాకారుడు పి.కె.బెనర్జీ మరణం 
  • మార్చి 22: కరోనా వ్యాప్తి నివారణకు ప్రధానమంత్రి నరేంద్రమోడి పిల్పు మేరకు దేశవ్యాప్తంగా జనతా కర్ఫ్యూ పాటించబడింది
  • మార్చి 23: మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రిగా శివరాజ్ సింగ్ చౌహాన్ బాధ్యతలు చేపట్టారు
  • మార్చి 23: దేశంలోనే తొలిసారిగా ముంబయిలో కొవిడ్‌-19 ఆసుపత్రిని ఏర్పాటు చేయబడింది (రిలయన్స్‌ సంస్థచే)
  • మార్చి 23: తిరుపతిలోని రాష్ట్రీయ సంస్కృత విద్యాపీఠం డీమ్డ్‌ విశ్వవిద్యాలయాన్ని జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయంగా మార్చబడింది
  • మార్చి 26: కాళాకారుడు సతీశ్‌ గుజ్రాల్‌ మరణం (ప్రధానిగా పనిచేసిన ఐకె గుజ్రాల్ సోదరుడు)
  • మార్చి 27: రాజకీయ నాయకుడు బేణిప్రసాద్ వర్మ మరణం 
  • మార్చి 27: బ్రహ్మకుమారీస్‌ సంస్థాన్‌ అధ్యక్షురాలు, రాజయోగిని దాదీ జానకి మరణం
  • మార్చి 27: అమెరికాకు చెందిన‌ ప్రముఖ పౌర హ‌క్కుల ఉద్య‌మ నేత జోసెఫ్ లౌరీ మ‌ర‌ణం
  • మార్చి 27: కేంద్ర మాజీ మంత్రి బేణీ ప్రసాద్‌ వర్మ మరణం
  • మార్చి 27: నాటోలో 30వ సభ్యదేశంగా ఉత్తర మాసిడోనియా చేరింది
  • మార్చి 30: దేశంలో తొలిసారి మణిపూర్‌లో ట్రాన్స్‌జెండర్‌ ఫుట్‌బాల్ టీం ఏర్పాటైంది
  • మార్చి 30: కాంగో మాజీ అధ్య‌క్షుడు జాక్వెస్ జాక్విన్ యోంబి ఒపాంగో మరణం
  • ఏప్రిల్ 2: ప్రపంచ వ్యాప్తంగా కోవిడ్-19 (కరోనా) కేసుల సంఖ్య మిలియన్ (పది లక్షలు) దాటింది
  • ఏప్రిల్ 5: లిబియా మాజీ ప్రధాని మ‌హ్మ‌ద్‌ జిబ్రిల్ మరణం
  • ఏప్రిల్ 7: దేశంలో మాస్కును తప్పనిసరి చేసిన తొలి రాష్ట్రంగా ఒడిశా అవతరించింది
  • ఏప్రిల్ 16: కరోనా రోగులను గుర్తించడానికి కేంద్రం అభివృద్ధి చేసిన ఆరోగ్య సేతు యాప్ 5 కోట్ల డౌన్‌లోడ్లు పూర్తి చేసుకున్న ఏకైక మొబైల్‌ యాప్‌గా ప్రపంచరికార్డు సృష్టించింది
  • ఏప్రిల్ 22: షెడ్యూల్డు ప్రాంతాల్లోనూ రిజర్వేషన్లు 50 శాతానికి మించరాదని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది
  • ఏప్రిల్ 25: తెలంగాణ‌లో ప్రభుత్వం పంట సీజన్ల పేర్లను మార్చింది. (జూన్‌ నుంచి సెప్టెంబరు కాలాన్ని ఖరీఫ్‌ బదులు వానాకాలం సీజన్‌గా, అక్టోబరు నుంచి మార్చి కాలాన్ని రబీ బదులు యాసంగిగా)
  • ఏప్రిల్ 28: OECDలో 28వ సభ్యదేశంగా కొలంబియా అవతరించింది
  • ఏప్రిల్ 29: బాలీవుడ్‌ నటుడు ఇర్ఫాన్‌ ఖాన్‌ మరణం
  • ఏప్రిల్ 30: బాలీవుడ్ సినీనటుడు రిషికపూర్ మరణం
  • ఏప్రిల్ 30: ఫుట్‌బాల్ క్రీడాకారుడు చుని గోస్వామి మరణం
  • ఏప్రిల్ 30: భారత మాజీ ఫుట్‌బాల్‌ ఆటగాడు చునీ గోస్వామి మరణం
  • మే 6: ఫోర్బ్స్‌ ఇండియా బిలియనీర్ల జాబితా (2020)లో రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ ఛైర్మన్‌ ముకేశ్‌ అంబానీ దేశంలో అత్యంత కుబేరుడిగా తొలిస్థానం పొందారు
  • మే 7: సాక్షర భారత్‌ స్థానంలో పఢ్‌నా లిఖ్‌నా అభియాన్‌ ప్రారంభించబడింది
  • మే 7: విశాఖపట్టణంలొ పాలిమర్ పరిశ్రమలో విషవాయువు లీకై 11 మంది మరణం, 5000+ మందికి అనారోగ్యం కలిగింది 
  • మే 10: ప్రముఖ చరిత్రకారుడు, విద్యావేత్త ప్రొఫెసర్‌ హరిశంకర్‌ వాసుదేవన్‌ మరణం
  • మే 14: యాదాద్రి భువనగిరి జిల్లా పుట్టపాకలోని చేనేత మగ్గాలపై తయారయ్యే తేలియా రుమాలు జియోగ్రాఫికల్‌ ఇండెక్స్‌(జీఐ) గుర్తింపు పొందింది
  • మే 21: తూర్పు భారతదేశం మరియు బంగ్లాదేశ్‌లలో అంపన్ తుఫాను వల్ల 100 మంది మరణం, ఆస్తినష్టం కలిగింది
  • మే 25: భారత హాకీ ఆటగాడు బల్బీర్‌ సింగ్‌ మరణం
  • మే 29: ఛత్తీస్‌గఢ్‌ మొదటి ముఖ్యమంత్రిగా పనిచేసిన అజిత్‌ ప్రమోద్‌ కుమార్‌ జోగి మరణం
  • మే 30: భారత మాజీ ఫుట్‌బాల్‌ ఆటగాడు బీర్‌ బహదూర్‌ మరణం
  • జూన్ 11: రిజర్వేషన్‌ అనేది వ్య‌క్తి ప్రాథమిక హక్కు కాదని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది
  • జూన్ 11: భారత సంతతికి చెందిన శాస్త్రవేత్త రత్తన్‌ లాల్‌కు వరల్డ్‌ ఫుడ్‌ ప్రైజ్‌-2020 ప్రకటించబడింది
  • జూన్ 14: సినీనటుడు సుషాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య చేసుకున్నాడు
  • జూన్ 17: 2021-21 కాలానికిగాను భద్రతామండలి తాత్కాలిక సభ్యదేశంగా భారత్ ఎన్నికైంది
  • జూన్ 18: ఐక్యరాజ్యసమితిలోని భద్రతామండలిలో తాత్కాలిక సభ్య దేశంగా భారత్‌ ఎన్నికైంది (2021-22 సం.కి గాను)
  • జూన్ 19: ప్రపంచంలో అత్యంత విలువైన 10 ఎక్స్ఛేంజీల జాబితాలో బాంబే స్టాక్‌ ఎక్స్ఛేంజీ (బీఎస్‌ఈ) స్థానం పొందింది
  • జూన్ 21: తూర్పు ఆఫ్రికా, ఆసియా (భారత్‌తో పాటు)లలో సూర్యగ్రహణం ఏర్పడింది 
  • జూన్ 28: కోవిడ్-19 (కరోనా) కేసుల సంఖ్య ప్రపంచచ్యాప్తంగా కలిపి 10 మిలియన్లు (ఒక కోటి) దాటింది
  • జూన్ 29:  భారత్ చైనాకు చెందిన 59 యాప్‌లపై నిషేధం విధించింది
  • జూలై 3: డాన్సర్ మరియు కొరొయోగ్రాఫర్‌గా ప్రసిద్ధి చెందిన సరోజ్ ఖాన్ మరణం
  • జూలై 8: ప్రపంచ ఆరోగ్య సంస్థ నుంచి అమెరికా వైదొలిగింది
  • జూలై 8: తెలంగాణ సారస్వత పరిషత్తుగా ఎల్లూరి శివారెడ్డి ఎన్నికయ్యారు

  • జూలై 10: మధ్యప్రదేశ్‌లోని రీవాలో 750 మెగావాట్ల భారీ సౌరవిద్యుత్తు ప్లాంటు ప్రధాని నరేంద్రమోదీచే ప్రారంభిచబడింది
  • జూలై 11:పార్లమెంటు ఎన్నికల్లో సింగపూర్‌ ప్రధాని లీ సియెన్‌ లూంగ్‌ ఆధ్వర్యంలోని పీపుల్స్‌ యాక్షన్‌ పార్టీ (పీఏపీ) విజయం సాధించింది
  • జూలై 11: కేంద్ర ప్రభుత్వం చేపట్టిన 2018 పులుల "కెమెరాల ద్వారా బంధించిన అతిపెద్ద వన్యప్రాణి సర్వే"గా గిన్నిస్‌ రికార్డు సృష్టించింది
  • జూలై 13: కేరళలోని శ్రీఅనంత పద్మనాభ ఆలయ నిర్వహణపై ట్రావెన్‌కోర్‌ (తిరువనంతపురం) రాజకుటుంబానికి హక్కులు ఉన్నట్టు సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది
  • జూలై 20: జాతీయ వినియోగదారుల హక్కుల చట్టం-2019 అమలులోకి వచ్చింది
  • జూలై 21: రాజకీయ నాయకుడు లాల్జీటాండన్ మరణం
  • జూలై 23: భారతీయ సైన్యంలో మహిళా అధికారులకు శాశ్వత కమిషన్‌ ఏర్పాటైంది
  • జూలై 25: ఉద్యమనేతగా పేరుపొందిన ఉప్పుమావులూరి సాంబశివరావు మరణం
  • జూలై 28: పారిశ్రామికవేత్త బీఎస్ బజాజ్ మరణం
  • జూలై 29: నూతన జాతీయ విద్యావిధానం - 2020ను కేంద్రమంత్రిమండలి ఆమోదించింది
  • జూలై 29: ప్రాన్సు నుంచి 5 రఫేల్‌ యుద్ధ విమానాలు భారత్ చేరాయి (అంబాలా వైమానిక స్థావరానికి)
  • జూలై 31: ఆంధ్రప్రదేశ్ 3 రాజధానుల బిల్లు ఆమోదించబడింది
  • ఆగస్టు 1 : ఆంధ్రప్రదేశ్‌ మాజీ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు మరణం
  • ఆగస్టు 1: రాజకీయ నాయకుడు అమర్‌సింగ్ మరణం

  • ఆగస్టు 5: బీరుట్ (లెబనాన్)లో భారీ పేలుడు, దేశంలో అత్యవసర పరిస్థితి విధింపు
  • ఆగస్టు 5: దేశంలో తొలిసారిగా కార్గో ఎక్స్‌ప్రెస్‌ దక్షిణ మధ్యరైల్వేలో ప్రారంభించబడింది (సనత్‌నగర్ నుంచి ప్రారంభం)
  • ఆగస్టు 5: మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేసిన శివరాజ్ నీలంగేకర్ పాటిల్ మరణం
  • ఆగస్టు 6: అఖిలభారత చేనేత మండలిని రద్దు చేయబడింది
  • ఆగస్టు 6: దుబ్బాక ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి మరణం
  • ఆగస్టు 7: శ్రీలంక పార్లమెంటు ఎన్నికల్లో శ్రీలంక పీపుల్స్‌ పార్ టీ(ఎస్‌ఎల్‌పీపీ) భారీ విజయం సాధించింది
  • ఆగస్టు 7: మహారాష్ట్రలో తొలి కిసాన్‌ రైలు ప్రారంభించబడింది
  • ఆగస్టు 7: కాలికట్ అంతర్జాతీయ విమానాశ్రయంలో అయిర్ ఇండియా విమానం ప్రమాదానికి గురై ముక్కలైంది
  • ఆగస్టు 11: కోవిడ్-19 నివారణకు రష్యా "స్పుత్నిక్‌-వి" పేరిట వాక్సీన్ విడుదల చేసింది
  • ఆగస్టు 16: భారత మాజీ క్రికెటర్ మరియు రాజకీయ నాయకుడు చేతన్ చౌహాన్ మరణం
  • ఆగస్టు 17: శాస్త్రీయ సంగీత విధ్వాంసుడు పండిత్ జస్‌రాజ్ మరణం
  • ఆగస్టు 19: మేఘాలయ గవర్నర్‌గా సత్య పాల్‌ మాలిక్‌ బాధ్యతలు చేపట్టారు
  • ఆగస్టు 20: 5వ విడత స్వచ్ఛ సర్వేక్షణ్‌ ర్యాంక్ (2020)లో ఇండోర్ ప్రథమస్థానంలో నిలిచింది (లక్షపైబడి జనాభా ఉన్న నగరాలలో)
  • ఆగస్టు 25: ప్రముఖ గేయ, కథా రచయిత కలువకొలను సదానంద మరణం
  • ఆగస్టు 26: అమేజాన్ అధిపతి జెఫ్ బెజోస్ 200 బిలియన్లు ఆస్తి కల్గిన తొలి వ్యక్తిగా అవతరించాడు
  • ఆగస్టు 27: ఎస్సీ, ఎస్టీలు, సామాజికంగా ఇతరత్రా వెనుకబడిన తరగతుల రిజర్వేషన్లకు సంబంధించి అవసరమైన చర్యలు తీసుకొనే అధికారం రాష్ట్రాలకు, పార్లమెంటుకు ఉందని సుప్రీంకోర్టు ప్రకటించింది
  • ఆగస్టు 28: జపాన్‌ను అత్యధిక కాలం పాలించిన ప్రధానమంత్రి షింజో అబె పదవికి రాజీనామా చేశారు 
  • ఆగస్టు 31: భారత రాష్ట్రపతిగా పనిచేసిన ప్రణబ్ ముఖర్జీ మరణం 
  • సెప్టెంబరు 1: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా పనిచేసిన మాతంగి నర్సయ్య మరణం
  • సెప్టెంబరు 4: పోప్ బెనెడిక్ట్ 16 అత్యధిక కాలం జీవించిన పోప్‌గా అవతరించాడు
  • సెప్టెంబరు 6: సుప్రీంకోర్టు రాజ్యాంగ మౌళిక స్వరూపంపై కీలకమైన తీర్పు ఇవ్వడానికి కారకుడైన కేశవానంద భారతి మరణం
  • సెప్టెంబరు 9: సాహితీవేత్త రామచంద్రమౌళి కాళోజీ అవార్డు అందుకున్నారు
  • సెప్టెంబరు 13: 2020 అమెరికన్ ఓపెన్ (మహిళల) టెన్నిస్ టైటిల్‌ను జపాన్‌కు చెందిన నవోమి ఒసాకా సాధించింది. 
  • సెప్టెంబరు 13: రాష్ట్రీయ జనతాదళ్ సీనియర్ నేత, మాజీ కేంద్రమంత్రి, బీహార్‌కు చెందిన రఘువంశ్ ప్రసాద్ సింగ్ మరణం 
  • సెప్టెంబరు 14: రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్‌గా హరివంశ్‌ నారాయణ్‌సింగ్‌ మరోసారి ఎన్నికయ్యారు 
  • సెప్టెంబరు 14: అమెరిక ఓపెన్ టెన్నిస్ (పురుషుల) టైటిల్‌ను ఆస్ట్రియాకు చెందిన డొమినిక్ థీమ్‌ గెలుచుకున్నాడు
  • సెప్టంబరు 16: తిరుపతి లోక్‌సభ సభ్యుడు, మాజీ రాష్ట్ర మంత్రి బల్లి దుర్గాప్రసాద్ రావు మరణం
  • సెప్టెంబరు 16: జపాన్‌ ప్రధానిగా యోషిహిదే సుగా ఎన్నికయ్యారు 
  • సెప్టెంబరు 17: అకాలీదళ్ నేత హర్‌సిమ్రత్‌ కౌర్‌ బాదల్‌ కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేశారు
  • సెప్టెంబరు 22: తెలంగాణలో కొత్త రెవెన్యూ చట్టం అమలులోకి వచ్చింది

  • సెప్టెంబరు 25: ప్రముఖ గాయకుడు ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం మరణం
  • సెప్టెంబరు 27: కేంద్రమంత్రిగా, ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడిగా పనిచేసిన జశ్వంత్ సింగ్ మరణం
  • సెప్టెంబరు 27: నాగొర్నో-కరాబాఖ్‌ ప్రాంతంకై ఆర్మేనియా-అజర్‌బైజాన్‌ మధ్య ఘర్షణ ప్రారంభమైంది
  • సెప్టెంబరు 29: ప్రపంచవ్యాప్తంగా కోవిడ్-19 (కరోనా) మరణాల సంఖ్య మిలియన్ (పది లక్షలు) దాటింది 
  • సెప్టెంబరు 29: వరుసగా తొమ్మిదో ఏడాది ముకేశ్ అంబాని దేశంలో అత్యంత ఆస్తిపరుడిగా నిల్చారు
  • సెప్టెంబరు 29: ప్రముఖ చిత్రకారుడు శంకర్ మరణం
  • సెప్టెంబరు 30: బాబ్రీమసీదు విధ్వంసంలో భాజపా అగ్రనాయకులకు, సంఘ్ నాయకులకు ఎలాంటి పాత్రలేదని వారు నిర్దోషులని సుప్రీంకోర్టు తీర్పు ప్రకటించింది.
  • అక్టోబరు 2: దేశంలో కరోనా మరణాల సంఖ్య లక్ష దాటింది
  • అక్టోబరు 3: దేశంలోనే అతి పొడవైన సొరంగమార్గం (అటల్ టన్నెల్) హిమాలయాల్లోని రోహ్‌తాంగ్‌లో ప్రధానమంత్రి నరేంద్రమోడిచే ప్రారంభించబడింది
  • అక్టోబరు 7: సీబీసి డైరెక్టరుగా, నాగాలాండ్ గవర్నరుగా పనిచేసిన అశ్వినీకుమార్ ఆత్మహత్య చేసుకున్నారు
  • అక్టోబరు 8: కేంద్రమంత్రి రాంవిలాస్ పాశ్వాన్ మరణం
  • అక్టోబరు 10: ఫ్రెంచ్ ఓపెన్ (మహిళల) సింగిల్స్ టైటిల్‌ను పోలాండ్‌కు చెందిన ఇగా స్వియాటెక్ గెలుచుకుంది
  • అక్టోబరు 11: ఫ్రెంచ్ ఓపెన్ (పురుషుల) సింగిల్స్ టైటిల్‌ను స్పెయిన్‌కు చెందిన రాఫెల్ నాదల్ సాధించాడు
  • అక్టోబరు 11: ప్రధానమంత్రి నరేంద్రమోడిచే స్వామిత్వ పథకం ప్రారంభించబడింది 
  • అక్టోబరు 12: రాజమాత విజయరాజె సింధితా జ్ఞాపకార్థం రూ.100/- నాణెం విడుదల చేయబడింది
  • అక్టోబరు 13: 4 సార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన గుండా మల్లేశ్ మరణం
  • అక్టోబరు 14: ప్రముఖ కూచిపూడి నృత్యకళాకారిణి శోభానాయుడు మరణం
  • అక్టోబరు 15: జ్ఞాన్‌పీఠ్ అవార్డు గ్రహీత, మలయాళ కవి ఏ.ఏ.నంబూద్రి మరణం 
  • అక్టోబరు 15: భారత్ తరఫున తొలి ఆస్కార్ (అకాడమి) పురస్కారం పొందిన భాను అథైయ మరణం

 

 

    ఇవి కూడా చూడండి:

    హోం
    విభాగాలు: కాలరేఖలు, 2020,

      కామెంట్‌లు లేవు:

      కామెంట్‌ను పోస్ట్ చేయండి

      Index


      తెలుగులో విజ్ఞానసర్వస్వము
      వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
      సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
      సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
      సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
      ప్రపంచము,
      శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
      క్రీడలు,  
      క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
      శాస్త్రాలు,  
      భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
      ఇతరాలు,  
      జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు,

          విభాగాలు: 
          ------------ 

          stat coun

          విషయసూచిక