బెంగాలీ కవియిత్రి, సంస్కర్త మరియు స్త్రీవాదిగా పేరుపొందిన కామిని రాయ్ అక్టోబరు 12, 1864న బెంగాల్‌లోని బసంద (ఇప్పటి బంగ్లాదేశ్)లో జన్మించింది. బెతూన్ పాఠశాలలో విద్యనభ్యసించి బ్రిటీష్ కాలంలో పాఠశాలకు హాజరైన మొదటి బాలికలలో ఒకరిగా పేరుపొందింది. బ్రిటిష్ ఇండియాలో మొదటి మహిళా గౌరవ గ్రాడ్యుయేట్ గానూ, బీఏ ఆనర్స్‌లో గ్రాడ్యుయేట్ పూర్తి చేసిన మెుదటి భారతీయ మహిళగా గుర్తింపు పొందింది.
పలు రచనలు చేసి రచయితగా పేరుపొందిన కామిని రాయ్ సంస్కర్తగా బెంగాల్‌లో మహిళల ఓటుహక్కు కోసం ఉద్యమించిన నారీ సమాజ్ లో కూడా పాలుపంచుకుంది. అబాలా బోస్ నుండి స్త్రీవాద భావనలు తీసుకుంది. బెంగాలీ సాహిత్య సదస్సు అధ్యక్షురాలిగా, బెంగాలి సాహిత్య పరిషత్ ఉపాధ్యక్షురాలిగా పనిచేసింది. కామినితాయ్ ముఖ్యమైన రచనలు : మహాశ్వేతా పుండొరిక్, పౌరాణికి, ద్విప్ ఓ ధూప్, మాల్య ఓ నిర్మల్య, గుంజన్ (పిల్లల పుస్తకం), బాలిక సిక్కర్ ఆదర్శ. కామిని రాయ్ సెప్టెంబరు 27, 1933న హజారీబాగ్ (బీహార్)లో మరణించింది. ఈమె సొదరుడు నిసిత్ చంద్ర సేన్ కలకత్తా హైకోర్టులో ప్రఖ్యాత న్యాయవాది మరియు కలకత్తా మేయర్ గా పనిచేశారు. భర్త కేదార్‌నాథ్ రాయ్. సొదరి జమినిరాయ్ నేపాల్ రాజు ఆస్థాన వైద్యురాలిగా పనిచేసింది. ఇవి కూడా చూడండి:
= = = = =
|
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి