17, జులై 2021, శనివారం

చిలుముల విఠల్‌ రెడ్డి (Chilumula Vithal Reddy)

చిలుముల విఠల్‌ రెడ్డి
రంగం
పోరాటయోధుడు, రాజకీయాలు
పదవులు
5 సార్లు ఎమ్మెల్యే, సిపిఐ పక్ష నాయకుడు, సర్పంచి,
నియోజకవర్గం
నర్సాపూర్ అసెంబ్లీ నియోజకవర్గం
మరణం
అక్టోబరు 19,  2012
చిలుముల విఠల్‌ రెడ్డి మెదక్ జిల్లా కౌడిపల్లి మండల కేంద్రమునకు చెందిన భూస్వామ్య కుటుంబంలో జన్మించారు. కమ్యూనిజం పట్ల ఆకర్షితుడై  కమ్యూనిస్టు పార్టీలో చేరి నిజాంకు వ్యతిరేకంగా ఉద్యమంలో పాల్గొన్నారు. కమ్యూనిస్ట్ నాయకుడైన విఠల్ రెడ్డి సిపీసి శాసనసభ పక్ష నాయకుడిగా కూడా పనిచేశారు. ఎన్టీ రామారావుతో ఈయనకు సన్నిహిత సంబంధాలు ఉండేవి. విఠల్ రెడ్డిని అప్పట్లో ఎన్టీఆర్ బావగా అభివర్ణించేవారు.

1957లో మొదటిసారి నర్సాపూర్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. 1956-62 వరకు కౌడిపల్లి సర్పంచ్‌గా కొనసాగారు. 1962లో మొదటిసారి సీపీఐ తరపున ఎమ్మెల్యేగా గెలుపొంది శాసనసభలో అడుగుపెట్టారు. ఆ తర్వాత 1978లో మరియు 1985, 89, 94ల్లో వరుసగా మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. 1999 సునీతా లక్ష్మారెడ్డి చేతిలో ఓడిపోయారు. ఓటమి తరువాత వయోభారం, అనారోగ్య కారణాల వల్ల రాజకీయాలకు దూరంగా ఉన్నారు. ఆయన అక్టోబరు 19 2012 న మెదక్ జిల్లా నర్సాపూర్‌లో తుదిశ్వాస విడిచారు.
 
 


హోం
విభాగాలు: మెదక్ జిల్లా ప్రముఖులు, కౌడీపల్లి మండలం,


 = = = = =


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి