3, నవంబర్ 2013, ఆదివారం

వాకిటి సునీతా లక్ష్మారెడ్డి ( Vakiti Sunitha Laxmareddy)

వాకిటి  సునీతా లక్ష్మారెడ్డి
జననంఏప్రిల్ 5, 1968
పదవులు3 సార్లు ఎమ్మెల్యే, రాష్ట్ర మంత్రి, తెలంగాణ తొలి మహిళా కమీషన్ చైర్‌పర్సన్‌
నియోజకవర్గంనర్సాపూర్ అ/ని,
వాకిటి సునీతా లక్ష్మారెడ్డి ( Vakiti Sunitha Laxmareddy) మెదక్ జిల్లాకు చెందిన రాజకీయ నాయకురాలు. ఏప్రిల్ 5, 1968న జన్మించిన సునీత బీఎస్సీ వరకు అభ్యసించారు. రాజకీయాలలో ప్రవేశించి 1999లో తొలిసారి శాసనసభకు ఎన్నికైనారు. ఆ తర్వాత 2004లోనూ, 2009లోనూ వరస విజయాలు సాధించి హాట్రిక్ సాధించారు. 2009లో వైఎస్సార్, రోశయ్య మంత్రివర్గాలలోనూ, 2010 డిసెంబరులో కిరణ్ కుమార్ మంత్రివర్గంలోనూ స్థానం పొందారు.

రాజకీయ ప్రస్థానం
భర్త లక్ష్మారెడ్డి శివంపేట జడ్పీటీసిగా పనిచేస్తూ 1999లో నర్సాపూర్ స్థానం నుంచి పార్టీ టికెట్ కొరకు ప్రయత్నించే సమయంలో అకస్మాత్తుగా మరణించారు. భర్త మరణానంతరం సునీత పార్టీ టికెట్ సంపాదించి తొలిసారి 1999లో మెదక్ జిల్లా నర్సాపూర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ తరఫున ఎన్నికైనారు. 2004లో ఇదే స్థానం నుంచి రెండోసారి విజయం సాధించారు. 2009లో కూడా వరసగా మూడవసారి గెలుపొంది హాట్రిక్ సాధించారు. 2009మేలో వైఎస్సార్ మంత్రివర్గంలో చిన్న నీటిపారుదల శాఖ మంత్రిగా స్థానం పొంది, ఆ తర్వాత రోశయ్య మంత్రివర్గంలో కూడా కొనసాగి, 2010 డిసెంబరులో కిరణ్ కుమార్ మంత్రివర్గంలో కేబినెట్ మంత్రిగా పనిచేశారు. డిసెంబరు 27, 2020న తెలంగాణ తొలి మహిళా కమీషన్ చైర్‌పర్సంగా నియమితులైనారు

బంధుత్వం
సునితా లక్షారెడ్డి భర్త వి.లక్ష్మారెడ్డి గోమారం గ్రామ సర్పంచిగా, శివంపేట జడ్పీటీసి సభ్యుడిగా పనిచేశారు.

ఇవి కూడా చూడండి:

.

హోం,
విభాగాలు: మెదక్ జిల్లా రాజకీయ నాయకులు, నర్సాపూర్ అసెంబ్లీ నియోజకవర్గం, 11వ శాసనసభ సభ్యులు, 12వ శాసనసభ సభ్యులు, 13వ శాసనసభ సభ్యులు, 13వ శాసనసభ మంత్రులు,


 = = = = =


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు,

      విభాగాలు: 
      ------------ 

      stat coun

      విషయసూచిక