23, ఏప్రిల్ 2013, మంగళవారం

చిన్నరాజమూరు ఆంజనేయస్వామి దేవాలయం (Chinarajamur Anjaneya Swamy Temple)

చిన్నరాజమూరు ఆంజనేయస్వామి
గ్రామంచిన్నరాజమూరు
మండలందేవరకద్ర
జిల్లామహబూబ్‌నగర్
పాలమూరు జిల్లా దేవరకద్ర మండలము చిన్నరాజమూరులో పురాతన చరిత్ర కలిగిన ఆంజనేయస్వామి ఆలయం ఉంది. ఇదే చిన్నరాజమూరు ఆంజనేయస్వామిగా ప్రసిద్ధిచెందింది. సుమారు 400 సంవత్సరాల క్రితం తుంగభద్రనది తీరాన వడ్డేపల్లి మండలం రాజోలి గ్రామ శివారులో వ్యాసమహర్షిచే ఆంజనేయస్వామి విగ్రహం ప్రతిష్టించబడింది. కాలక్రమేణ ఇది భూస్థాపితమైంది. ఒకనాడు రైతు పొలం దున్నుచుండగా నాగలికి విగ్రహం తగిలింది. ఆ రోజు రాత్రి స్వామివారు ఆ రైతు కలలో కనిపించి ఈ విగ్రహాన్ని బండిపై వేసుకొని ఉత్తర దిశకు ప్రయాణమవ్వాలని, బండి ఇరుసు ఎక్కడైతే విరుగుతుందో అక్కడే విగ్రహాన్ని ప్రతిష్టించాలని చెపినట్లు కథనం. స్వామి వారు ఆదేశించినట్లుగా రైతు బండిలో విగ్రహాన్ని పెట్టి ఉత్తర దిశలో ప్రయాణం సాగించాడు. చివరికి ఈ ప్రాంతం రాగానే బండి చక్రం ఇరుసు తెగిపోవడం, స్వామివారిని ఇక్కడే ప్రతిష్టించడం జరిగింది. ఏటా స్వామివారికి మార్గశిర మాసంలో బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తారు.

ఈ ఆలయం జిల్లా కేంద్రం నుంచి 30 కిమీ దూరంలో, మండల కేంద్రం దేవరకద్ర నుంచి 10 కిమీ దూరంలో ఉంది. మహబూబ్‌నగర్ నుంచి వచ్చేవారైనా, నారాయణపేట వైపు నుంచి వచ్చేవారైనా దేవరకద్ర చేరి అక్కడి నుంచి బస్సులు లేదా పైవేటు వాహనాల ద్వారా ఆలయానికి చేరుకోవచ్చు.

విభాగాలు: పాలమూరు జిల్లా దేవాలయాలుదేవరకద్ర మండలము

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు,

      విభాగాలు: 
      ------------ 

      stat coun

      విషయసూచిక