3, డిసెంబర్ 2013, మంగళవారం

అంగడి రాయచూర్ (Angadi Raichur)

అంగడి రాయచూర్ గ్రామము
గ్రామముఅంగడి రాయచూర్
మండలముకోడంగల్ 
జిల్లామహబూబ్‌నగర్
జనాభా4217 (2001)
4698 (2011)
అంగడి రాయచూర్ మహబూబ్‌నగర్ జిల్లా కోడంగల్ మండలమునకు చెందిన గ్రామము. ఇది పంచాయతి కేంద్రము.

భౌగోళికం, సరిహద్దులు:
ఈ గ్రామానికి ఉత్తరాన అన్నారం, తూర్పున చిట్లపలి, నైరుతిన ఇందనూర్, రావలపల్లి, వాయువ్యాన టేకులకోడ్ గ్రామాలు, దక్షిణాన దౌల్తాబాదు మండలం సరిహద్దులుగా ఉన్నాయి.

జనాభా:
2001 లెక్కల ప్రకారం గ్రామ జనాభా 4217. ఇందులో పురుషులు 2111, మహిళలు 2106. గృహాల సంఖ్య 787.
2011 గణన ప్రకారం గ్రామ జనాభా 4698. ఇందులో పురుషులు 2316, మహిళలు 2382. గృహాల సంఖ్య 981. అక్షరాస్యత శాతం 41.78%. గ్రామ కోడ్ సంఖ్య 574906.

రాజకీయాలు:

జూలై 23, 2013న జరిగిన గ్రామపంచాయతి ఎన్నికలలో గ్రామ సర్పంచిగా మలేశ్వరి ఎన్నికయ్యారు.


విభాగాలు: కోడంగల్ మండలంలోని గ్రామాలు


 = = = = =

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి