చిన్న నందిగామ మహబూబ్‌నగర్ జిల్లా కోడంగల్ మండలమునకు చెందిన గ్రామము. ఇది పంచాయతి కేంద్రము.
భౌగోళికం, సరిహద్దులు: భౌగోళికంగా ఈ గ్రామం మండలంలో దక్షిణ భాగంలో ఉంది. ఈ గ్రామానికి తూర్పున పెద్ద నందిగామ, ప్యాలమద్ది, వాయువ్యాన చిట్లంపల్లి గ్రామాలు, దక్షణాన దౌల్తాబాదు మండలం సరిహద్దుగా ఉన్నాది. జనాభా: 2001 లెక్కల ప్రకారం గ్రామ జనాభా 1225. ఇందులో పురుషులు 602, మహిళలు 623. గృహాల సంఖ్య 251. 2011 గణన ప్రకారం గ్రామ జనాభా 1276. ఇందులో పురుషులు 627, మహిళలు 649. గృహాల సంఖ్య 262. అక్షరాస్యత శాతం 31.97%. గ్రామ కోడ్ సంఖ్య 574913. రాజకీయాలు: జూలై 23, 2013న జరిగిన గ్రామపంచాయతి ఎన్నికలలో గ్రామ సర్పంచిగా మేఘమాల ఎన్నికయ్యారు.
= = = = =
| |||||||||||

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి