అప్పాయిపల్లి మహబూబ్‌నగర్ జిల్లా కోడంగల్ మండలమునకు చెందిన గ్రామము. ఇది పంచాయతి కేంద్రము.
భౌగోళికం, సరిహద్దులు: ఈ గ్రామం భౌగోళికంగా మండలంలో ఉత్తరం వైపున ఉంది. ఈ గ్రామానికి ఈశాన్యాన ఉడిమేశ్వరం, ఆగ్నేయాన కోడంగల్, నైరుతిన చిట్లపల్లి గ్రామాలు, ఉత్తరాన మరియు వాయువ్యాన రంగారెడ్డి జిల్లా సరిహద్దులుగా ఉన్నాయి. జనాభా: 2001 లెక్కల ప్రకారం గ్రామ జనాభా 1074. ఇందులో పురుషులు 523, మహిళలు 551. గృహాల సంఖ్య 200. 2011 గణన ప్రకారం గ్రామ జనాభా 1433. ఇందులో పురుషులు 700, మహిళలు 733. గృహాల సంఖ్య 311. అక్షరాస్యత శాతం 42.01%. గ్రామ కోడ్ సంఖ్య 574903. రవాణా సౌకర్యాలు: కోడంగల్ నుంచి తాండూరు వెళ్ళు ప్రధానరహదారి గ్రామం సమీపం నుంచి వెళ్ళుచున్నది. కాబట్టి ప్రధాన పట్టణాలకు వెళ్ళడానికి గ్రామస్థులకు రవాణా సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయి. రాజకీయాలు: జూలై 23, 2013న జరిగిన గ్రామపంచాయతి ఎన్నికలలో గ్రామ సర్పంచిగా దస్తమ్మ ఎన్నికయ్యారు.
= = = = =
| |||||||||||

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి