చిట్టెంపల్లి మహబూబ్‌నగర్ జిల్లా కోడంగల్ మండలమునకు చెందిన గ్రామము. ఇది పంచాయతి కేంద్రము.
భౌగోళికం, సరిహద్దులు: ఈ గ్రామం భౌగోళికంగా మండలంలో మధ్యలో ఉన్నది. ఈ గ్రామానికి తూర్పున కోడంగల్, పశ్చిమాన అన్నారం, అంగడి రాయచూర్ గ్రామాలు, ఉత్తరాన రంగారెడ్డి జిల్లా, దక్షిణాన కొంతవరకు దౌల్తాబాదు మండలం సరిహద్దులుగా ఉన్నాయి. జనాభా: 2001 లెక్కల ప్రకారం గ్రామ జనాభా 2317. ఇందులో పురుషులు 1153, మహిళలు 1164. గృహాల సంఖ్య 454. 2011 గణన ప్రకారం గ్రామ జనాభా 2902. ఇందులో పురుషులు 1468, మహిళలు 1434. గృహాల సంఖ్య 527. అక్షరాస్యత శాతం 35.63%. గ్రామ కోడ్ సంఖ్య 574902. రవాణా సౌకర్యాలు: హైదరాబాదు - యాద్గీర్ అంతర్రాష్ట్ర రహదారి గ్రామం మీదుగా వెళ్ళుచున్నది. రాజకీయాలు: జూలై 23, 2013న జరిగిన గ్రామపంచాయతి ఎన్నికలలో గ్రామ సర్పంచిగా టి.ఆశప్ప ఎన్నికయ్యారు.
= = = = =
| |||||||||||

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి