3, డిసెంబర్ 2013, మంగళవారం

హస్నాబాదు (Hasnabad)

 హస్నాబాదు గ్రామము
గ్రామముహస్నాబాదు 
మండలముకోడంగల్ 
జిల్లామహబూబ్‌నగర్
జనాభా5199 (2001)
5748 (2011)
హస్నాబాదు మహబూబ్‌నగర్ జిల్లా కోడంగల్ మండలమునకు చెందిన గ్రామము. ఇది పంచాయతి కేంద్రము.ఈ గ్రామం కోడంగల్ మహబూబ్ నగర్ ప్రధాన రహదారికి కొద్దిగా లోనికి ఉంది. మండలంలో ఇది 3వ పెద్ద గ్రామము. జిల్లా పరిషత్తు అధ్యక్షుడిగా, ఉపాధ్యక్షుడిగా, 25 సం.లు కోడంగల్ సమితి అధ్యక్షుడిగా పనిచేసిన కె.శ్రీనివాస్ రెడ్డి, సినిమాలలో విలన్‌గా రాణిస్తున్న ప్రభాకర్ ఈ గ్రామానికి చెందినవారు.

భౌగోళికం, సరిహద్దులు:
ఈ గ్రామం భౌగోళికంగా మండలంలో ఆగ్నేయాన ఉన్నది. ఈ గ్రామానికి ఉత్తరాన పర్సాపూర్, పశ్చిమాన పెద్దనందిగామ గ్రామాలు, తూర్పున బొంరాస్‌పేట్ మండలం, దక్షిణాన దౌల్తాబాదు మండలం సరిహద్దులుగా ఉన్నాయి.

జనాభా:

2001 లెక్కల ప్రకారం గ్రామ జనాభా 5199. ఇందులో పురుషులు 2608, మహిళలు 2591. గృహాల సంఖ్య 953.
2011 గణన ప్రకారం గ్రామ జనాభా 5748. ఇందులో పురుషులు 2811, మహిళలు 2937. గృహాల సంఖ్య 1059. అక్షరాస్యత శాతం 49.30%. గ్రామ కోడ్ సంఖ్య 574917.

రవాణా సౌకర్యాలు:
మహబూబ్‌నగర్ నుంచి తాండూరు వెళ్ళు ప్రధానరహదారి గ్రామం సమీపం నుంచి వెళ్ళుచున్నది. కాబట్టి ప్రధాన పట్టణాలకు వెళ్ళడానికి గ్రామస్థులకు రవాణా సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయి.

రాజకీయాలు:

జూలై 23, 2013న జరిగిన గ్రామపంచాయతి ఎన్నికలలో గ్రామ సర్పంచిగా ఎల్లమ్మ ఎన్నికయ్యారు.


విభాగాలు: కోడంగల్ మండలంలోని గ్రామాలు


 = = = = =

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి