3, డిసెంబర్ 2013, మంగళవారం

ఇందనూర్ (Indanoor)

ఇందనూర్ గ్రామము
గ్రామముఇందనూర్ 
మండలముకోడంగల్ 
జిల్లామహబూబ్‌నగర్
జనాభా1123 (2001)
1376 (2011)
ఇందనూర్ మహబూబ్‌నగర్ జిల్లా కోడంగల్ మండలమునకు చెందిన గ్రామము. ఇది పంచాయతి కేంద్రము.

భౌగోళికం, సరిహద్దులు:
భౌగోళికంగా ఈ గ్రామం మండలంలో దక్షిణ భాగంలో ఉంది. ఈ గ్రామానికి తూర్పున రావులపలి, పశ్చిమాన కస్తూరుపల్లి, ఉత్తరాన అంగడిరాయచూర్, గండ్లేపల్లి గ్రామాలు, దక్షిణాన దౌల్తాబాదు మండలం సరిహద్దులుగా ఉన్నాయి.

జనాభా:
2001 లెక్కల ప్రకారం గ్రామ జనాభా 1123. ఇందులో పురుషులు 556, మహిళలు 567. గృహాల సంఖ్య 218.
2011 గణన ప్రకారం గ్రామ జనాభా 1376. ఇందులో పురుషులు 684, మహిళలు 692. గృహాల సంఖ్య 280. అక్షరాస్యత శాతం 42.81%. గ్రామ కోడ్ సంఖ్య 574911.

రవాణా సౌకర్యాలు:

కోడంగల్ నుంచి గుల్బర్గా వెళ్ళు రహదారి గ్రామం మీదుగా వెళ్ళుచున్నది.

రాజకీయాలు:

జూలై 23, 2013న జరిగిన గ్రామపంచాయతి ఎన్నికలలో గ్రామ సర్పంచిగా బాల్‌రెడ్డి ఎన్నికయ్యారు.


విభాగాలు: కోడంగల్ మండలంలోని గ్రామాలు


 = = = = =

2 కామెంట్‌లు: