3, డిసెంబర్ 2013, మంగళవారం

కస్తూర్ పల్లి (Kasturpally)

 కస్తూర్ పల్లి గ్రామము
గ్రామముకస్తూర్ పల్లి
మండలముకోడంగల్ 
జిల్లామహబూబ్‌నగర్
జనాభా1156 (2001)
1331 (2011)
కస్తూర్ పల్లి మహబూబ్‌నగర్ జిల్లా కోడంగల్ మండలమునకు చెందిన గ్రామము. ఇది పంచాయతి కేంద్రము. ఇది కర్ణాటక సరిహద్దులో గుల్బర్గా వెళ్ళు రహదారిలో ఉన్నది. లొంకబసవన్నగా ప్రసిద్ధి చెందిన చారిత్రక ఆలయం కస్తూర్ పల్లి శివారులో ఉన్నది.

భౌగోళికం, సరిహద్దులు:
భౌగోళికంగా ఈ గ్రామం మండలంలో పశ్చిమభాగంలో ఉంది. ఈ గ్రామానికి తూర్పున ఇందనూర్, ఉత్తరాన గండ్లేపల్లి శివారు, పశ్చిమాన కర్ణాటక రాష్ట్రం, దక్షిణాన దౌల్తాబాదు మండలం సరిహద్దులుగాఉన్నాయి.

జనాభా:

2001 లెక్కల ప్రకారం గ్రామ జనాభా 1156. ఇందులో పురుషులు 564, మహిళలు 592. గృహాల సంఖ్య 229.
2011 గణన ప్రకారం గ్రామ జనాభా 1331. ఇందులో పురుషులు 636, మహిళలు 695. గృహాల సంఖ్య 253. అక్షరాస్యత శాతం 26.97%. గ్రామ కోడ్ సంఖ్య 574910.

రవాణా సౌకర్యాలు:

కోడంగల్ నుంచి గుల్బర్గా వెళ్ళు ప్రధాన రహదారి గ్రామం మీదుగా వెళ్ళుచున్నది. కాబట్టి ప్రధాన పట్టణాలకు వెళ్ళడానికి గ్రామస్థులకు రవాణా సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయి.

రాజకీయాలు:
జూలై 23, 2013న జరిగిన గ్రామపంచాయతి ఎన్నికలలో గ్రామ సర్పంచిగా పద్మమ్మ ఎన్నికయ్యారు.


విభాగాలు: కోడంగల్ మండలంలోని గ్రామాలు


 = = = = =

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి