కోడంగల్ మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన గ్రామము మరియు మండల కేంద్రము. ఇది మేజర్ గ్రామపంచాయతి. హైదరాబాదు నుంచి బీజాపూర్ వెళ్ళు అంతర్రాష్ట్ర రహదారి కోడంగల్ నుంచి వెళ్తుంది. ఈ గ్రామం హైదరాబాదు నుంచి 100 కిమీ, మహబూబ్ నగర్ నుంచి 60 కిమీ దూరంలో, తాండూరు నుంచి 18 కిమీ దూరంలో ఉంది. సినీనటుడు ఖలీల్ ఈ గ్రామానికి చెందినవారు. ప్రసిద్ధి చెందిన శ్రీవేంకటేశ్వరస్వామి దేవాలయం ఈ గ్రామంలో ఉంది.
భౌగోళికం, సరిహద్దులు: ఈ గ్రామం భౌగోళికంగా మండలంలో తూర్పువైపున ఉన్నది. ఈ గ్రామానికి దక్షిణాన పర్సాపూర్, నైరుతిన ప్యాలమద్ది, పశ్చిమాన చిట్లపల్లి, వాయువ్యాన అప్పాయిపల్లి, ఉతరాన ఉడిమెశ్వరం గ్రామాలు, తూర్పున బొంరాస్‌పేట్ మండలం సరిహద్దులుగా ఉన్నాయి. జనాభా: 2001 లెక్కల ప్రకారం గ్రామ జనాభా 13434. ఇందులో పురుషులు 6919, మహిళలు 6515. గృహాల సంఖ్య 2341. 2011 గణన ప్రకారం గ్రామ జనాభా 14294. ఇందులో పురుషులు 7051, మహిళలు 7243. గృహాల సంఖ్య 3052. అక్షరాస్యత శాతం 58.67%. గ్రామ కోడ్ సంఖ్య 574905.
హైదరాబాదు నుంచి యాద్గీర్ వెళ్ళు అంతర్రాష్ట్ర రహదారి మరియు మహబూబ్‌నగర్ నుంచి తాండూరు వెళ్ళు ప్రధానరహదారి గ్రామం గుండా వెళ్ళుచున్నాయి. కాబట్టి రాష్ట్ర రాజధాని, జిల్లా రాజధాని మరియు తాండూరు, కర్ణాటకల నుంచిమంచి రవాణా సౌకర్యాలున్నాయి. గ్రామానికి రైలు సదుపాయం లేకున్ననూ 18 కిమీ దూరంలో ఉన్న తాండూరు రైల్వేస్టేషన్ గ్రామస్థులకు అందుబాటులో ఉంది. గ్రామపాలన: కోడంగల్ గ్రామపాలన మేజర్ గ్రామపంచాయతిచే కొనసాగుతోంది. ఒకప్పుడు ఇది పురపాలక సంఘం. 1964లో మేజర్ గ్రామపంచాయతిగా మార్చబడింది. ఎందరో ప్రముఖులు ఈ పంచాయతి సర్పంచులుగా పనిచేసి రాజకీయంగా పైకి వచ్చారు. రాజకీయాలు: జూలై 23, 2013న జరిగిన గ్రామపంచాయతి ఎన్నికలలో గ్రామ సర్పంచిగా వెంకటరెడ్డి ఎన్నికయ్యారు. విద్యాసంస్థలు: లాహోటి డిగ్రీ కళాశాల, నవోదయ డిగ్రీ కళాశాల, ప్రభుత్వ జూనియర్ కళాశాల.
= = = = =
| |||||||||||||


కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి