7, డిసెంబర్ 2013, శనివారం

పులిచింతల ప్రాజెక్టు (Pulichintala Project)

 పులిచింతల ప్రాజెక్టు
జిల్లాగుంటూరు జిల్లా
నదికృష్ణానది
ప్రారంభండిసెంబరు 7, 2013
జలాశయం సామర్థ్యం46 టీఎంసీలు
పులిచింతల ప్రాజెక్టును కృష్ణానదిపై గుంటూరు జిల్లా బెల్లంకొండ మండలం పులిచింతల వద్ద నిర్మించారు. 15లక్షల ఎకరాలకు సాగు నీటిని కల్పించడం దీని లక్ష్యం. జలాశయంలో 46 టీఎంసీల నీటిని నిల్వ చేసే అవకాశం ఉంది. 2004లో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్సార్ జలయజ్ఞంలో భాగంగా దీనికి శంకుస్థాపన చేశారు. డిసెంబరు 7, 2013న ప్రాజెక్టు ప్రారంభించబడింది.

జలాశాయం కొరకు 28 గ్రామాలు ముంపుగ్రామాలుగా ప్రకటించారు. ఇందులో నల్గొండ జిల్లాలో 13, గుంటూరు జిల్లాలో 15 గ్రామాలున్నాయి. 2006లో ఈ ప్రాజెక్టుకు డా.కె.ఎల్.రావు ప్రాజెక్టుగా పేరు మార్చారు. 2013, డిసెంబరు 7న ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఈ ప్రాజెక్టును ప్రారంభించారు. కృష్ణా నదిపై ఈ ప్రాజెక్టుకు ఎగువన నాగార్జిన సాగర్ ప్రాజెక్టు, దిగువన ప్రకాశం బ్యారేజీలు ఉన్నాయి.

ఈ ప్రాజెక్టు పొడవు 1290 మీటర్లు, ఎత్తు 42 మీటర్లు. ప్రాజెక్టుకు 24 క్రెస్ట్ గేట్లు ఉన్నాయి. భావిష్యత్తులో 120 మెగావాట్ల జలవిద్యుతుత్పత్తి చేయాలనే ప్రతిపాదన కూడా ఉంది. 
 
 
ఇవి కూడా చూడండి:




హోం,
విభాగాలు:
ఆంధ్రప్రదేశ్ ప్రాజెక్టులు, గుంటూరు జిల్లా ప్రాజెక్టులు, కృష్ణానది, 


 = = = = =

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి