4, అక్టోబర్ 2014, శనివారం

గుంటూరు జిల్లా (Guntur Dist)

గుంటూరు జిల్లా
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
వైశాల్యం11,391 చ.కి.మీ
జనాభా48,89,230 (2011)
మండలాలు57
గుంటూరు జిల్లా ఆంధ్రప్రదేశ్‌లోని 13 జిల్లాలలో ఒకటి. ఈ జిల్లా వైశాల్యం 11,391 చ.కి.మీ. మరియు 2011 లెక్కల ప్రకారం జనాభా 48,89,230. ఈ జిల్లాకు ఆగ్నేయాన బంగాళాఖాతము, తూర్పున కృష్ణా జిల్లా, దక్షిణాన ప్రకాశం జిల్లా, పశ్చిమాన తెలంగాణకు చెందిన మహబూబ్‌నగర్ జిల్లా, మరియు వాయువ్యాన తెలంగాణకు చెందిన నల్గొండ జిల్లా సరిహద్దులుగా ఉన్నాయి. ఆంధ్రదేశ చరిత్రలో ప్రఖ్యాతిచెందిన పల్నాటి యుద్ధం ఇక్కడే జరిగింది. స్వాతంత్ర్య సమరంలో పెదనందిపాడు పన్నుల ఎగవేత, సైమన్ కమీషన్ ఉద్యమం లాంటి చారిత్రక ఘట్టాలతో ఈ జిల్లాకు సంబంధం ఉంది. వరి, పొగాకు, ప్రత్తి మరియు మిర్చి జిల్లా యొక్క ప్రధాన వ్యవసాయ ఉత్పత్తులు. కృష్ణానది ముఖ్య నది. జిల్లాలోని చారిత్రక స్థలాలలో ప్రముఖమైనవి అమరావతి, భట్టిప్రోలు, ఉండవల్లి గుహలు. జిల్లాలో 57 రెవెన్యూ మండలాలు కలవు.

భౌగోళికం, సరిహద్దులు:
గుంటూరు జిల్లా వైశాల్యం 11,391 చదరపు కిలోమీటర్లు. ఈ జిల్లాకు ఆగ్నేయాన బంగాళాఖాతము, దక్షిణాన ప్రకాశం జిల్లా, పశ్చిమాన మహబూబ్ నగర్ జిల్లా, మరియు వాయువ్యాన నల్గొండ జిల్లా సరిహద్దులుగా ఉన్నాయి. కృష్ణానది జిల్లా ఉత్తర భాగం నుంచి ప్రవహిస్తూ కృష్ణా జిల్లా నుంచి వేరుచేస్తున్నది. 

చరిత్ర:
గుంటూరు ప్రాంతంలో పాత రాతి యుగము నాటినుండి మానవుడు నివసించినాడనుటకు ఆధారములు లభించాయి. 10వ శతాబ్ది నాటి వేంగీ చాళుక్య అమ్మరాజ శాసనాలలో గుంటూరు గురించిన ప్రథమ ప్రస్తావన ఉన్నది. బౌద్ధం ప్రారంభం నుంచి గుంటూరు ప్రాచుర్యంలో ఉంటూ వచ్చింది. బౌద్ధులు ప్రాచీన కాలంలోనే ధాన్యకటకము(ధరణికోట) వద్ద విద్యాలయమును స్థాపించారు. వివిధ కాలాల్లో గుంటూరును పాలించిన వంశాలలో ప్రముఖమైనవి: శాతవాహనులు, ఇక్ష్వాకులు, పల్లవులు, ఆనందగోత్రీకులు, విష్ణుకుండినులు, చాళుక్యులు, చోళులు, కాకతీయులు, రెడ్డి రాజులు, విజయనగర రాజులు మరియు కుతుబ్ షాహీలు. గుంటూరు ప్రాచీనాంధ్రకాలమునాటి కమ్మనాడు, వెలనాడు, పలనాడు లో ఒక ముఖ్యభాగము. కొందరు సామంతరాజులు కూడ ఈ ప్రాంతాన్ని పాలించారు. ఈ సామంతుల మధ్య కుటుంబ కలహాలు, వారసత్వ పోరులు సర్వసాధారణంగా ఉండేవి. అటువంటి వారసత్వపోరే ప్రసిద్ధి గాంచిన పలనాటి యుద్ధం. జిల్లాలోని పలనాడు ప్రాంతంలో 1180 లలో జరిగిన ఈ యుద్ధం "ఆంధ్ర కురుక్షేత్రం" గా చరిత్ర లోను, సాహిత్యంలోను నిలిచిపోయింది.

ఉండవల్లి గుహలు
17వ శతాబ్దిలో ఔరంగజేబు కుతుబ్‌ షాహి రాజ్యాన్ని ఆక్రమించినపుడు గుంటూరు కూడా మొఘల్ సామ్రాజ్యంలో భాగమయింది. ఆసఫ్‌ ఝా 1724లో హైదరాబాదుకు నిజాముగా ప్రకటించుకొన్నాడు. ఉత్తర సర్కారులు అని పేరొందిన కోస్తా జిల్లాలను ఫ్రెంచి వారు 1750 లో ఆక్రమించుకొన్నారు. 1788లో ఈస్ట్ ఇండియా కంపెనీ ఏలుబడి లోనికి వచ్చి, గుంటూరు మద్రాసు ప్రెసిడెన్సీ లో భాగమైంది. 1794లో 14 తాలూకాలతో జిల్లా ఆవిర్భవించింది. 1859లో జిల్లాను రాజమండ్రి, మచిలీపట్నం జిల్లాలతో విలీనం చేసి కృష్ణా గోదావరి జిల్లాగా నామకరణం చేసారు. 1904 లో మళ్ళీ జిల్లాను ఏర్పాటు చేసారు. 1947 లో దేశానికి స్వాతంత్ర్యం వచ్చినపుడు మద్రాసు ప్రెసిడెన్సీ మద్రాసు రాష్ట్రం లో భాగం అయింది. 1953లో ఆంధ్ర రాష్ట్రంలో, 1956లో ఆంధ్రప్రదేశ్‌లో భాగంగా మారింది. 1970 ఫిబ్రవరి 2 న ప్రకాశం జిల్లా ఏర్పాటు చేసినపుడు జిల్లా రూపురేఖలలో మార్పుకు లోనయ్యాయి. ఒంగోలు తాలూకా మొత్తం, బాపట్ల, నరసరావుపేట, వినుకొండ తాలూకాలలోని కొన్ని ప్రాంతాలను విడదీసి ప్రకాశం జిల్లాను ఏర్పాటు చేసారు.

జనాభా:
2011 లెక్కల ప్రకారం జిల్లా జనాభా 48,89,230. ఇది దేశంలో అత్యధిక జనాభా ఉన్న 22వ జిల్లా. జనసాంద్రత 429. 2001-11 దశాబ్దిలో జనాభా పెరుగుదల రేటు 9.5%. స్త్రీ, పురుష నిష్పత్తి 1000:1003. 



హోం,
విభాగాలు: గుంటూరు జిల్లా, ఆంధ్రప్రదేశ్ జిల్లా వ్యాసాలు,


 = = = = =


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు,

      విభాగాలు: 
      ------------ 

      stat coun

      విషయసూచిక