1, డిసెంబర్ 2013, ఆదివారం

సర్వాయి పాపన్న (Sarvai Papanna)

 సర్వాయి పాపన్న
జననంఆగస్టు 18, 1650
స్వస్థలంఖిలాషాపూర్ (జనగామ జిల్లా)
సర్వాయి పాపన్న ఆగస్టు 18, 1650 నాడు నేటి జనగామ జిల్లా రఘునాథపల్లి మండలం ఖిలాషాపూర్ గ్రామంలో జన్మించాడు. అప్పటి పాలకులు, జాగీర్దారులు, దొరలు, భూస్వాములు చేసే దురాగతాలను గమనించి గోల్కొండ కోటపై బడుగువారి జెండాను ఎగురవేయాలని నిర్ణయించి ఆ దిశగా ప్రస్థానం ప్రారంభించాడు. అయితే పాపన్నకు ఎలాంటి వారసత్వ నాయకత్వం కాని, ధనంకాని, అధికారం కాని లేవు. అయిననూ ఒక్కో మెట్టు ఎక్కుతూ దాదాపు 12 వేల సైనికులను సమకూర్చుకొని ఎన్నో కోటలను జయించి చివరకు గోల్కొండకోటను స్వాధీనపర్చుకొని 7 నెలలపాటు అధికారం చెలాయించాడు. తెలంగాణ లో మొగలాయి విస్తరణను తొలిసారిగా అడ్డుకున్నది సర్వాయి పాపన్నే. ఒక సామాన్యవ్యక్తి శతృదుర్భేద్యమైన కోటలను వశపర్చుకోవడం అతని వ్యూహానికి నిదర్శనం. సర్వాయిపేట కోటతో మొదలుపెట్టి దాదాపు 20 కోటలను తన అధీనంలోకి తెచ్చుకున్నాడు. అతని ఆలోచనలకు బెంబేలెత్తిన భూస్వాములు, మొగలాయి తొత్తులైన నిజాములు కుట్రలు పన్ని సైన్యాన్ని బలహీనపర్చారు.

గుర్తింపులు:
నిర్మల్ లో జూలై 30, 2012 నాడు సర్వాయి పాపన్న విగ్రహం ప్రతిష్టించబడింది. ఆగష్టు 18, 2012 నాడు సర్వాయిపేట గ్రామంలో సర్వాయి పాపన్న విగ్రహం కరీంనగర్ లోకసభ సభ్యుడు పొన్నం ప్రభాకర్ చే ఆవిష్కరించబడింది.
 
 
ఇవి కూడా చూడండి:



విభాగాలు: జనగామ జిల్లా ప్రముఖులు, రఘునాథపల్లి మండలము, తెలంగాన చరిత్ర, 


 = = = = =

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి